కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన ముగియబోతోంది. యాత్ర ముగింపు సభ జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరగనుంది.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశ రాజకీయాల్లో పలు మార్పులు వచ్చాయని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై గతంలో చాలా మందికి అనేక అనుమానాలు, అపోహలు ఉండేవని, కానీ, ఈ యాత్ర ద్వారా ఆయన నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతోందని అన్నారు. 2022లో రాహుల్ గాంధీ అనుసరించిన విధానాలను 2023లో కూడా అనురిస్తే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా రాహుల్ పై ప్రజలకు నమ్మకం కలుగుతుందని, తద్వారా 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ, అధికార మార్పు చూసే అవకాశం ఉంటుందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
2022 వ సంవత్సరం బీజేపీకి మరోసారి కలిసివచ్చింది. 2022లో దేశంలోని ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించగా, హిమాచల్ ప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. అయితే, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఆప్ పంజాబ్‌లో అనూహ్యంగా విజయం సాధించి అధికారంలోకి రావడం కొసమెరుపు. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఏకచక్రాధిపత్యంగా వెలుగొందుతున్న బీజేపీకి ఆప్ చెక్ పెట్టింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయకేతనం ఎగరవేసింది.
బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి సొంత పార్టీపై చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. శ్రీరాముడు, హనుమంతుడిని బీజేపీ కార్యకర్తలుగా చేసి మాట్లాడటం తగదని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వలన ఇబ్బందులు వస్తాయని అన్నారు. బీజేపీ తప్పించి ఇతరులెవ్వరూ కూడా వారి భక్తులు కాకూడదనే భావనను ప్రజల్లో కలిగించవద్దని అన్నారు. దేవుళ్లకు కులాలు, మతాలు ఆపాదించవద్దని తెలిపారు. వేదకాలం నుండే రాముడు, హనుమంతుడిని కొలుస్తున్నారని అన్నారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ చేపడుతున్న భారత్ జోడో యాత్రపై కూడా ఆమె విమర్శలు చేశారు. భారత దేశం ముక్కలైందని అంటున్న రాహుల్ గాంధీ ఎక్కడ అది జరిగిందో చెప్పాలని అన్నారు. 370 అధికరణను రద్దు చేసిన తరువాత భారత దేశం మరింత బలోపేతమైందని అన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున ప్రజల నుండి మద్దతు లభిస్తున్నది. కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్నారు. ఈ యాత్ర ద్వారా మళ్లీ కాంగ్రెస్‌కు పునర్వైభవం వస్తుందని నమ్ముతున్నారు. రాజకీయంగా రాహుల్ గాంధీ చేస్తున్న మంచి పనులను మెచ్చుకుంటున్నారు. అయితే, ఐదు పదుల వయసు వచ్చినా ఇంకా బ్యాచులర్ గా ఉండిపోయిన విషయాన్ని ఎవరూ ప్రస్తావించడం లేదు. పెళ్లి విషయం గురించి ఎప్పుడు ప్రస్తావించినా ఏదో ఒక సాకు చూపించి సమాధానం దాటేసే రాహుల్ గాంధీ తన మనసులో మాటను బయటపెట్టారు.
భారత్ జోడో యాత్ర ఢిల్లీలో కొనసాగుతున్నది. రాహుల్ గాంధీకి శనివారం రోజున ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున ఈ యాత్రలో పాల్గొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్నది మోడీ పాలన కాదని, అంబానీ, అదానీల ప్రభుత్వం నడుస్తోందని దుయ్యబట్టారు.
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ యాత్రకు సంఘీభావం తెలిపారు.రాహుల్ గాంధీతో పాటు కొన్ని కిలోమీటర్లు నడిచారు.కమల్ హాసన్ వచ్చి చేరడంతో భారత్ జోడో యాత్రకు మరింత ఊపు వచ్చింది. వేలాది మంది అభిమానులు వీరితో కలిసి కదంతొక్కారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చివరి దశకు చేరుకుంటున్నది. రాజస్థాన్ నుండి శనివారం రోజున ఢిల్లీలో రాహుల్ యాత్ర ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయం పార్టీ అధినేత కమల్ హాసన్ పాల్గొననున్నారు. నేడు రాహుల్‌తో కలిసి నడవనున్నారు. తమిళనాడులో కమల్ హాసన్ మక్కల్ నీది మయం పేరుతో పార్టీని నడుపుతున్నారు.
మరికొన్ని రోజుల్లో యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ భారత్ జోడో యాత్రలో పాల్గోనున్నారు. ఈ నెల 24న భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించనుంది. అదే రోజున కమల్ హాసన్ భారత్ జోడో యాత్రలో పాల్గోనున్నట్లు తెలుస్తోంది.
భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆగడాలు పెరిగిపోయాయని, యుద్ధసన్నాహాలు చేసుకుంటే దాడులు చేయడానికి సిద్దమౌతుంటే కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్దుర పోతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర రాజస్థాన్‌లో జరుగుతున్నది. ఈ సందర్భంగా కేంద్రం పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.