రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగుతుంది.. మరో నాలుగు రోజుల్లో ఈ యాత్ర ముగియనుంది. శ్రీనగర్ లో ఈ నెల 30 న యాత్ర ముగింపు సందర్బంగా భారీ సభ నిర్వహించనున్నారు.ఈ సభ జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరగనుంది.
రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర గత నాలుగు నెలలుగా విజయవంతంగా సాగుతుంది. భారత్ జోడో యాత్ర మొదలైన రోజునుండి ఇప్పటికే వరకు కేవలం వైట్ టి షర్ట్ తోనే యాత్ర సాగిస్తూ వచ్చాడు. ఈ యాత్రలో రాహుల్..ఫస్ట్ టైం జాకెట్ ధరించి కనిపించాడు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతోంది.
రాహుల్ గాంధీ ఏ విధంగానూ 'పప్పు'కాదు 'తెలివిగల వ్యక్తి' అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు
సెప్టెంబర్ 7న కన్యాకుమారి వద్ద ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో యాత్ర.. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల విూదుగా సాగి ఢిల్లీ వరకు చేరుకుంది.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ ‘ఓ యోధుడు’ అని, ప్రభుత్వ బలానికి భయపడే వ్యక్తి కాదని అన్నది. అతడి ఇమేజ్ను దెబ్బతీయడానికి ప్రభుత్వం ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు.
Bharat Jodo Yatra: రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర రెండో దశ ఢిల్లీలో నేటినుండి ప్రారంభంకానుంది. ఈరోజు ఉదయం ఢిల్లీ లోని ఎర్రకోట సమీపంలోని హనుమాన్ దేవాలయం నుండి యాత్ర ప్రారంభం కానుంది. 12 గంటలకు సరిహద్దు అయిన ‘లోని’ కి చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఈ పాదయాత్ర మొత్తం 9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ముగిసింది. యూపీ, హరియాణ, పంజాబ్‌ల మీదుగా జమ్ముకశ్మీర్ చేరుకుంటుందని తెలిపారు. జనవరి 30న జాతీయ జెండా […]
Rahul Gandhi: భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం తమ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుంది బీజేపీ కి ఎదురుదెబ్బ తగలనుంది ఎద్దేవా చేసారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 140 లోక్‌సభ స్థానాలు తమకు క్లిష్టంగా ఉంటాయని బీజేపీ అంచనా వేసింది. తాజా సర్వేలు, అంచనాల ప్రకారం ఆ సంఖ్య 160కి చేరినట్టు పార్టీ వర్గాలు చర్చించుకొంటున్నట్టు జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి […]
Digvijay Singh: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో విజయవంతంగా సాగుతుంది. ఈ ‘భారత్ జోడో యాత్ర’పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్ జోడో యాత్ర కారణంగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మసీదులు, మదరసాల్లో పర్యటిస్తున్నారని అన్నారు. ఇండోర్‌లో మీడియాతో దిగ్విజయ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీని విమర్శించడంలో బీజేపీ […]
Revanth Reddy: తెలంగాణ లో రాక్షస పాలన సాగుతోందని..కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేధావులు, ఉద్యమకారులు కేసీఆర్‌కు ఎందుకు లొంగిపోయారని ప్రశ్నించారు. అమరుల త్యాగాలను మరిచిపోవొద్దని అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద లేదా అని ప్రశ్నించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణాలో ముగిసిన సందర్బంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద రాహుల్ యాత్ర వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సభ లో […]
Rahul Gandhi: తెలంగాణ లో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర గతరాత్రి తో పూర్తి అయ్యింది. నేటి నుండి మహారాష్ట్రలో మొదలుకాబోతుంది. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద రాహుల్ యాత్ర వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సభ లో రాహుల్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తెలంగాణాని విడిచి వెళ్తుంటే బాధగా ఉందని రాష్ట్రంలో కార్యకర్తలు అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. దీన్ని మీడియాలో చూపించినా, చూపించకపోయినా తన కళ్లతో చూస్తున్నానని తెలిపారు. […]