ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. నాలుగైదు నెలల క్రితం చంద్రబాబు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని ప్రతిరోజూ తన ప్రసంగాల్లో చెప్పుకుంటూ వచ్చేవారు.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీకొడతామని, ఎన్నికల్లో విజయం తమదేనని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఇది ఆ పార్టీకి నైతికంగా బలాన్ని పెంచింది.
ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధికి ఓటు వేయడంతో పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా, గెలుపుకు అవసరమైన 23 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది.
చంద్రబాబుకు రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉంది. ఎప్పుడు ఎలా ఆ అనుభవాన్ని వినియోగించుకోవాలో ఆవిధంగా వినియోగించుకుంటారు. దీనికి ఓ ఉదాహరణ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో వ్యూహాత్మకంగా పొత్తుపెట్టుకొని విజయం సాధించారు. మూడు పట్టభద్రుల స్థానాలను టీడీపీ కైవసం చేసుకున్నది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధించగా, నేడు జరిగిన ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడో స్థానంలో టీడీపీ అనూహ్యంగా విజయం సాధించింది.
ఎమ్మెల్యే కోటాలో నేడు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, ఏడు స్థానాలకుగాను 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థులు బరిలో ఉండగా, ఒక స్థానం కోసం టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నారు.
Vishnukumar Raju: ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో గెలిచిన సీట్లు సైతం బీజేపీ కోల్పోయిందనే సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ మద్దతు ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన పీవీఎన్ మాధవ్ ఈసారి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. దీనిపై ఆ పార్టీలో అంతర్మథనం మొదలైందని తాజాగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు నిజం చేస్తున్నాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ముగ్గురు కలవాలని అన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, […]
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఈనెల 16వ తేదీన ప్రారంభం కాగా, పూర్తి స్థాయి ఫలితాలు వెలువడాల్సి ఉన్నది. అయితే, మూడు ప్రాంతాల్లోనూ సైకిల్ జోరుమీదున్నది.
MLC ELections: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల కౌంటింగ్ కేంద్రం దగ్గర హై అలర్ట్ ప్రకటించారు. వైసీపీకి చెందిన వారు దాడులకు పాల్పడతారని అనుమానంతో కౌంటింగ్ కేంద్రం దగ్గర పోలీసు ఉన్నతాధికారులు భద్రత పెంచినట్టు చెబుతున్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ప్రతి రౌండ్ కౌంటింగ్లో టీడీపీ ఆధిక్యత కనబరుస్తోంది, ఓటమి భయంతో కౌంటింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు వైసీపీ నేతలు స్కెచ్ వేశారని అంటూ ప్రచారం జరుగుతోంది. నిఘా వర్గాల సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు జేఎన్టీయూ కేంద్రం దగ్గర […]
Shock to YSRCP: ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల అత్యవసర భేటీ అయ్యారని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై నేతల మధ్య హాట్ హాట్ చర్చ జరిగిందని, వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనుకున్నాం కానీ ఈ స్థాయిలో ఉందని అంచనా వేయలేకపోయామంటున్నారని తెలుస్తోంది. తమ అస్త్రాలు ప్రభుత్వ వ్యతిరేకత ముందు విఫలమయ్యాయని నేతలు అభిప్రాయపడ్డారని, ఈ ఫలితాలు తమకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయంటూ వైసీపీ నేతలు కామెంట్ చేశారని అంటూ టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. కడప […]