నేడు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వార్షిక బడ్జెన్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 10 గంటలకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం మంత్రి కాకాణి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల తరువాత క్యాబినెట్ భేటీ అయింది. ఈ భేటీలో ఆమోదించాల్సిన బిల్లులు, బడ్జెట్, వ్యవసాయం బడ్జెట్ తదితర అంశాలపై చర్చించారు. ఈ చర్చల అనంతరం సీఎం జగన్ మంత్రులతో ముచ్చటించారు. మంత్రివర్గ విస్తరణ తరువాత చాలా మంది మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోవాలని, లేదంటే ఉద్వాసన తప్పదని హెచ్చరించారు.
Governor Addresses AP Assembly Budget Session: ఏపీలో నాలుగేళ్లుగా సంక్షేమ..పారదర్శక పాలన కొనసాగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. జీఎస్డీపీలో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలిచిందన్నారు. ఏపీలో తలసరి ఆదాయం రూ. 2.19 లక్షలకు పెరిగిందన్నారు. రాష్ట్ర ఆర్ధికపరిస్థితి నాలుగేళ్లుగా మెరుగుపడిందని గవర్నర్ చెప్పారు. ప్రతి ఏటా 11.43 శాతం జీఎస్డీపీ […]
నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో నేడు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రపంగం అనంతరం బీఏసీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో సమావేశాలను ఎన్నిరోజులపాటు నిర్వహించాలి, సమావేశాల అజెండా ఏంటన్నది నిర్ణయిస్తారు.