T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జింబాబ్వే
ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న టి20 ప్రపంచకప్‌కు జింబాబ్వే క్వాలిఫై అయ్యింది. జింబాబ్వేతో పాటు నెదర్లాండ్స్ కూడా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్ చేరాయి. బులవాయోలో జరిగిన తొలి సెమీ ఫైనల్లో జింబాబ్వే 27 పరుగుల తేడాతో పపువా న్యూ గినియాపై విజయం సాధించింది. జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేయగా, న్యూ గినియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేయగలిగింది.
జింబాబ్వే జట్టు.. ఒకప్పుడు క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన దేశం. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి మేటిజట్లను ఓడించి సంచలనాలు నమోదు చేసింది. గత దశాబ్ద కాలం వరకు జింబాబ్వే జట్టు మోస్తరుగానే రాణించింది. కానీ కొన్నేళ్ల నుంచి మాత్రం వారి ఆటతీరు నాసిరకంగా తయారైంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. క్రికెట్లో పేద దేశంగా పేరు పొందిన జింబాబ్వేలో ఆటగాళ్లకు, బోర్డుకు అంతర్గత వ్యవహారాల్లో విబేధాలు, జాతి వివక్ష లాంటి ఎన్నో అంశాలు చుట్టుముట్టాయి.