WPL 2023: గుజరాత్ జెయింట్స్ పై యూపీ వారియర్స్ విజయం
WPL 2023: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది గుజరాత్ జెయింట్స్. ఆరంభ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఘోరంగా ఓడిన గుజరాత్.. ఆదివారం నాడు యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి పరాజయం పాలైంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో యూపీపై 3 వికెట్ల తేడాతో ఓడింది. 170 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని యూపీ చివరి ఓవర్ వరకు ఆడి ఛేదించింది.
ఈ విజయంతో యూపీ జట్టు పాయింట్ల ఖాతాను తెరవడంతో పాటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ముందుగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో కిరణ్ నావ్‌గిరే(53), గ్రేస్ హ్యారిస్(59) అర్ధశతకాలతో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. యూపీ విజయానికి ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం అయిన తరుణంలో.. గ్రేస్ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది ఒక బంతి మిగిలుండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చింది. దీంతో మరో పరాజయాన్ని చవిచూడాల్సివచ్చింది గుజరాత్ జెయింట్స్.