Delhi vs Up Warriorz: ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం
Delhi vs Up Warriorz: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు గెలుపొందింది. యూపివారియర్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 42 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూపీ వారియర్స్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులకే పరిమితమైంది. తహిళా మెక్‌గ్రాత్ 50 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90 నాటౌట్ మినహా అంతా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు యూపివారియర్స్ కెప్టెన్ హీలీ, శ్వేత 1 , కిరణ్ నవ్‌గిరె 2 వెనువెంటనే అవుట్ కావడంతో 31/3తో తీవ్ర కష్టాల్లో పడింది. మెక్‌గ్రాత్ కు ఒక్కరు కూడా అండగా నిలవలేకపోయారు. బెంగళూరుతో తొలి పోరులో అదరగొట్టిన మెగ్ లానింగ్, షఫాలీ వర్మ ఈ మ్యాచ్‌లో నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించారు.
తహిళా మెక్‌గ్రాత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. ఆమెకు మరోవైపు సహకారం లభించలేదు. ఒక్కరు క్రీజ్ లో నిలబడితే ఈ మ్యాచ్ లో యూపీ వారియర్స్ గెలుపొందేదేమో. అయితే ప్లేయర్లందరూ ఢిల్లీ బౌలర్ల దెబ్బకు ఫెవిలియం బాట పట్టారు. మెక్‌గ్రాత్ ఒక్కరే ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. జట్టును గెలిపించకపోయినా.. ఢిల్లీ ప్లేయర్స్ కి మాత్రం చెమటలు పట్టించింది.