World Cup Hockey 2023: 16 జట్లు… 17 రోజులు…
World Cup Hockey 2023: హాకీ ప్రపంచ కప్ పోటీలు ఈనెల 13 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలాలో ఈ మ్యాచ్‌లను జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు 17 రోజులపాటు జరుగుతాయి. జనవరి 29 వ తేదీన ఫైనల్స్ జరుగుతుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. ఒక్కో పూల్‌లోని జట్టు అదే పూల్‌లోని మరో జట్టుతో ఒక్కో మ్యాచ్ అడుతుంది. గ్రూప్‌లో టాప్ ప్లేసులో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్‌కు చేరుకుంటుంది.
ఇక గ్రూప్ విభాగంలో రెండు మూడు స్థానాల్లో నిలిచిన జట్లు మిగతా పూల్స్‌లోని జట్లతో నాకౌట్ మ్యాచ్‌లు ఆడతాయి. రౌండ్స్‌లో నిలిచిన మొదటి నాలుగు జట్లు క్వార్టర్స్ కు చేరుకుంటాయి. అనంతరం ఈ ఎనిమిది జట్ల మధ్య క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్‌ను నిర్వహిస్తారు. 2028లోనూ భారత్ హాకీ ప్రపంచకప్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. 2022లో ప్రపంచకప్ పోటీలు జరగాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్లన ఆలస్యం అయ్యాయి. 2023లో జనవరి 13వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నాయి.
పూల్ ఏలో అర్జంటైనా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా… పూల్ బిలో బెల్జియం, జపాన్, కొరియా, జర్మనీ… పూల్ సీలో మలేషియా, చిలీ, నెదర్లాండ్, న్యూజిలాండ్… పూల్ డీలో భారత్, స్పెయిన్, ఇంగ్లాండ్, వేల్స్ జట్లు తలపడనున్నాయి.