Womens Premier League: గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
Womens Premier League: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్ తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించి డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి విజయాన్ని నమోదు చేసింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 143 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 64కే ఆలౌట్ అయింది.
టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 65 తో చెలరేగింది. ఆమెతో పాటు మాథ్యూస్ 47 , అమేలియా 45 పరుగులతో రాణించడం ముంబై టీమ్ భారీ స్కోర్ చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. గార్డ్‌నర్, తనుజా, జార్జియా తలో వికెట్ తీశారు
బౌలింగ్‌లో అయితే గుజరాత్ జట్టు బ్యాటర్లను కట్టడి చేసింది ముంబై జట్టు.. ఏ దశలోనూ వారిని కోలుకోనివ్వలేదు. ఆరంభం నుంచే వికెట్లు తీస్తూ గట్టిగా దెబ్బకొట్టింది. గుజరాత్ జెయింట్స్ టాప్ ఆర్డర్ వరుసగా ఫెవిలియన్ బాటపట్టారు తర్వాత వచ్చినవారిపై ఒత్తిడి పెరిగింది. గుజరాత్ జెయింట్స్ లో నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. దయాలన్ హేమలత చేసిన 29 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు చేయగలిగింది.