ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు శర్మ పేరు కలిగిన ఎందరో ప్లేయర్లు తమ సత్తా చాటారు. తాజాగా మరో శర్మ కూడా మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ జట్టు తరపున ఓపెనర్‌గా బరిలో దిగిన వివ్రాంత్ శర్మ 47 బంతుల్లో 69 పరుగులు చేశాడు.
Vivrant Sharma of SRH created a record on his debut Match
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు శర్మ పేరు కలిగిన ఎందరో ప్లేయర్లు తమ సత్తా చాటారు. తాజాగా మరో శర్మ కూడా మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ జట్టు తరపున ఓపెనర్‌గా బరిలో దిగిన వివ్రాంత్ శర్మ 47 బంతుల్లో 69 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మలు గురించి క్రికెట్ అభిమానులకు దాదాపుగా తెలుసు. చాలా కాలంగా టీమిండియా తరపున వీరిద్దరూ ఎన్నో మ్యాచుల్లో ఆడారు. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి మరికొందరు శర్మలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. వారిలో సందీప్ శర్మ, సుయాశ్ శర్మ, మోహిత్ శర్మ, జితేశ్ శర్మ, అభిషేక్ శర్మ, కర్ణ శర్మ తదితరులు ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో తమ జట్ల తరపున రాణించారు. అభినందనలు అందుకుంటున్నారు.
అభిషేక్ శర్మ,జితేశ్ శర్మ బ్యాటింగ్ విభాగంలో తన ప్రతిభను చాటుకుంటే సందీప్ శర్మ, సుయాశ్ శర్మ, మోహిత్ శర్మ బౌలంగ్ విభాగంలో తమ సత్తా చాటారు. తాజాగా వివ్రాంత్ శర్మ కూడా వెలుగులోకి వచ్చాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వివ్రాంత్ శర్మ మెరుపులు మెరిపించాడు. 69 పరుగులు చేసి తన జట్టుకు శుభారంభం అందించాడు. ఐపీఎల్ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వివ్రాంత్ శర్మ రికార్డు నెలకొల్పాడు.
Maiden IPL FIFTY in his 3⃣rd match 🔥
Vivrant bhai, 🔝 knock 🧡 pic.twitter.com/pX9OTvKgwA
— SunRisers Hyderabad (@SunRisers) May 21, 2023
Maiden IPL innings, maiden IPL FIFTY 🔥🧡 pic.twitter.com/Mwjoj83ZyS
— SunRisers Hyderabad (@SunRisers) May 21, 2023
SRH have registered their highest ever partnership in IPL 2023. pic.twitter.com/MOxA2d1ATI
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2023
Highest score by an Indian in his debut innings in IPL history. Vivrant Sharma, take a bow 🫡
He breaks Swapnil Asnodkar's long-standing record before departing!
— SunRisers Hyderabad (@SunRisers) May 21, 2023