Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లేటెస్ట్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఆటగాళ్లు సిక్సులు, ఫోర్లతో దుమ్ముదులుపుతున్నారు. స్టేడియాలన్నీ దద్దరిళ్లిపోతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) హైదరాబాద్‌లో (Hyderabad) సందడి చేశారు.
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లేటెస్ట్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఆటగాళ్లు సిక్సులు, ఫోర్లతో దుమ్ముదులుపుతున్నారు. స్టేడియాలన్నీ దద్దరిళ్లిపోతున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) హైదరాబాద్‌లో (Hyderabad) సందడి చేశారు. ఫిల్మ్‌నగర్‌లోని ఆర్సీబీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కొత్త ఇంటికి వెళ్లారు. కోహ్లీతోపాటు డూప్లెసిస్, వెయిన్ పార్నెల్, కేదార్ జాదవ్‌లు సిరాజ్ ఇంటికి వెళ్లి సందడి చేశారు.
హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈనెల 18న ఆర్సీబీ (RCB), ఎస్ఆర్హెచ్ (SRH) మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లు సోమవారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సిరాజ్ వారందరికీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్.. ఐపీఎల్ సీజన్-16లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరుపున అత్యధిక వికెట్లు తీసి ఫుల్ జోరు మీదున్నాడు. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 16 వికెట్లు తీశారు. ఇక గురువారం జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపొందితే ప్లేఆఫ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 12 పాయింట్లతో ఐదో స్థానంలోఉంది.
Virat Kohli And RCB team visited Siraj New House Opening In Film Nagar Jubilee Hills , HYD ❤️🔥❤️❤️#ViratKohli #Siraj #RCB #RoyalChallengersBangalore #RCBvsSRH @mufaddal_vohra @CricCrazyJohns @imVkohli pic.twitter.com/8DOzAR56c6
— Tarak Anna || Anil 🖤 (@AnilTarakianNTR) May 15, 2023