India Vs Bangladesh: విరాట్ కోహ్లీ వీరవిహారం, 72వ సెంచరీ నమోదు
Virat Kohli scored his 44th ODI Century
విరాట్ కోహ్లీ వీరవిహారం సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో చెలరేగి ఆడాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఈ క్రమం సెంచరీ నమోదు చేశాడు. వన్డేలలో విరాట్‌కు ఇది 44వ సెంచరీ. మొత్తంగా 72వ సెంచరీ. విరాట్ కోహ్లీ 2019లో వన్డేల్లో చివరి సెంచరీ చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తన బ్యాట్ ఝుళిపించాడు. సెంచరీ చేశాడు. 1214 రోజుల తర్వాత వన్డే సెంచరీ చేశాడు. 2019 ఆగస్టు 14న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. రికీ పాంటింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 100 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలు నమోదు చేశాడు.
విరాట్ కోహ్లీ టెస్టుల్లో 27 సెంచరీలు చేయగా, వన్డేల్లో 44 సెంచరీలు పూర్తి చేశాడు. మొత్తం 72 సెంచరీలు చేసిన కోహ్లీ సచిన్ రికార్డును చేరుకుంటాడో లేదో చూడాలి.
కొన్ని నెలల క్రితం జరిగిన ఆసియా కప్ పోటీల్లో ఆఫ్గనిస్తాన్‌పై సెంచరీ సాధించడం ద్వారా విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అక్కడి నుంచి గాడిలో పడ్డాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో కోహ్లీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ తెగ సంబరపడిపోతున్నారు.
𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 𝐅𝐎𝐑 𝐕𝐈𝐑𝐀𝐓 𝐊𝐎𝐇𝐋𝐈 💥💯
He brings up his 44th ODI ton off 85 deliveries.
He goes past Ricky Ponting to be second on the list in most number of centuries in international cricket.
Live – https://t.co/HGnEqtZJsM #BANvIND pic.twitter.com/ohSZTEugfD
— BCCI (@BCCI) December 10, 2022
Virat Kohli has been the fastest to score runs in every format of the game. And today he scored his 44th ODI century in just 256 innings . 🥵#ViratKohli𓃵 #INDvsBAN pic.twitter.com/YTBizhmq4C
— Akshat (@AkshatOM10) December 10, 2022
After 3 years, 3 months, and 26 days – Virat Kohli notches up a century in the ODI format.#BANvIND
— Prajakta (@18prajakta) December 10, 2022