Virat Kohli Century: తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్, సెంచరీతో కదం తొక్కిన కోహ్లీ
Virat Kohli scored Century in the First ODI against Sri lanka
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు విజృంభించింది. భారీ స్కోర్ చేసింది. 7 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కాడు. 113 పరుగులు చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్బుతంగా ఆడి జట్టుకు గట్టి పునాది వేశారు. రోహిత్ శర్మ 80 పరుగులు, గిల్ 70 పరుగులు చేశారు. వీరు ఔటైన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 39 పరుగులు, హార్ధిక్ పాండ్యా 14, అక్షర్ పటేల్ 9 పరుగులు చేశారు. మొత్తంగా 50 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత జట్టు 373 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి మహ్మద్ షమీ 4 పరుగులతోను, మహ్మద్ సిరాజ్ 7 పరుగులతోను నాటౌట్‌గా నిలిచారు.
విరాట్ కోహ్లీ వీరవిహారం
విరాట్ కోహ్లీ వీరవిహారం చేశాడు. సెంచరీతో కదం తొక్కాడు. 80 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. కోహ్లీకి ఇది 45వ సెంచరీ కావడం విశేషం. కొత్త ఏడాదిలో కోహ్లీ ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే మరుపరాని ఇన్నింగ్స్ ఆడాడు. ఎటువంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశారు. లంక ఫీల్డర్లు ఇచ్చిన లైఫ్‌ను కోహ్లీ సద్వినియోగ పరుచుకున్నాడు. కోహ్లీ సెంచరీలో 10 బౌండరీలు ఒక సిక్సర్ ఉన్నాయి.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔటైన తర్వాత బరిలో దిగిన కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి నెమ్మదిగా బ్యాట్ ఝుళిపించారు. ఆ తర్వాత గేర్ మార్చాడు. తనదైన శైలిలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. స్టేడియం నలువైపులా పరుగుల వరద పారించాడు. అభిమానులను అలరించాడు.
గత ఏడాది తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ ఈ కొత్త ఏడాదిలో తిరిగి విజృంభించాడు. సెంచరీ తర్వాత కూడా దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో లంక బౌలర్ రజిత వేసిన ఓ బాల్‌ను అర్ధం చేసుకోలేకపోయాడు. అడ్డంగా దొరికిపోయాడు. 113 పరుగుల వద్ద ఔటయ్యాడు. 87 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 113 పరుగులు చేసి వెనుదిరిగాడు. కోహ్లీ ఔటయ్యే సమయానికి భారత జట్టు స్కోర్ 364 పరుగుల వద్ద ఉంది.
🙌🙌💯#INDvSL @mastercardindia pic.twitter.com/DgdSlDSbpg
— BCCI (@BCCI) January 10, 2023