Virat Kohli: తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరం
ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. తొడ కండరాలు పట్టేయడంతో తొలి మ్యాచ్‌కు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ రోజు జరిగిన ప్రాక్టీస్‌లో కోహ్లీ కనిపించలేదు. నాటింగ్హమ్ నుంచి లండన్ బయలుదేరిన టీమ్ బస్సులో కూడా కోహ్లీ కనిపించలేదు. మూడో టీ20 ఆడుతున్న సందర్భంగా కోహ్లీకి గాయమయింది.
జూలై 12న కెన్నింగ్టన్ ఓవల్‌లో తొలి వన్డే జరగనుంది. జూలై 14న లార్డ్స్ మైదానంలో రెండో వన్డే జరగనుంది. జూలై 17న మాంచెస్టర్‌లో మూడో వన్డే జరగనుంది. కోహ్లీ మొదటి వన్డేకు దూరమైనా, రెండో మూడో వన్డేలకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కోహ్లీ గాయం తీవ్రం ఏ విధంగా ఉందనే విషయం ఇంకా స్పష్టం కాకపోవడంతో వెస్టిండీస్ వెళ్లనున్న జట్టును ఇంకా ప్రకటించలేదు. భారత జట్టు వెస్టిండీస్‌తో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. విండీస్ పర్యటనకు వెళ్లే జట్టును రేపు ప్రకటించనున్నారు.
విరాట్కోహ్లీకి గత కొంత కాలంగా కాలం కలిసి రావడం లేదు. పరుగులు చేయడంలో తీవ్రంగా విఫలతున్న కోహ్లీకి మరో షాక్ తగిలింది. మూడవ టీ20 మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడు.