విరాట్ కోహ్లీ బ్రెయిన్ ఫ్రై అయిపోయింది..
ఐపీఎల్‌లోని ప్రతీ మ్యాచ్‌లో విఫలమౌతున్న విరాట్ కోహ్లీపై భారత మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లు విఫలమైనప్పుడు వారిపై అనవసర ఒత్తిడి తీసుకువస్తే ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. విరాట్ కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడన్న రవి శాస్త్రి .. టీం ఇండియా జట్టులో ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాలంటే అది కోహ్లీకి మాత్రమే అన్నారు. కోహ్లీ బ్రెయిన్ ఫ్రై అయిపోయిందన్నాడు. విరాట్ రీఫ్రెష్‌తో రీ ఎంట్రీ ఇవ్వాలంటే అతనికి విశ్రాంతి చాలా అవసరం అన్నాడు. అది రెండు నెలలైనా, నెలన్నర రోజులైనా పర్యాలేదని చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీపై రవి శాస్త్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు క్రికెట్ విశ్లేషకుల్లో చర్చనీయంశంగా మారింది. గతంలోనే విరాట్‌పై రవి శాస్త్రి తీవ్రంగా స్పందించారు. విరాట్ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్స్ కెప్టెన్ అయినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై చర్చించారు. సాధారణంగా బ్యాట్స్‌మెన్ కెప్టెన్‌గా ఉండే పిచ్‌పై పచ్చిక ఉంటే ఆందోళన చెందుతారని అభిప్రాయపడ్డారు. కానీ విరాట్ కోహ్లీ ఇందుకు విరుద్ధమని, పచ్చికను పట్టించుకోడని అన్నారు. ఇదంతా చూస్తుంటే ఇంతకు ముందే విరాట్ కోహ్లీకి రవి శాస్త్రికి మధ్య పెద్దగొడవే జరిగిందని చెప్పాలి. అంతకు ముందు అనిల్ కుంబ్లే టీం ఇండియా హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే విరాట్ కోహ్లీ కుంబ్లేతో గొడవకు దిగి కుంబ్లే సూచనలను మ్యాచ్‌లో అమలు చేయకపోవడంతో కుంబ్లే తన పదవికి రాజీనామా చేశారు.