There could be more Covid cases: ఐదో టెస్టుకు కరోనా గండం
Kohli is said to have recovered: ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు మ్యాచ్‌కు ముందే టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. కరోనా కలకలంతో భారతజట్టులో అలజడి మొదలయింది. ఇప్పటికే స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడి ఇంగ్లండ్ వెళ్లలేకపోయాడు. తాజాగా విరాట్ కోహ్లీకి కరోనా వైరస్ సోకిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవలే మాల్దీవుల్లో విహార యాత్రకు వెళ్లిన విరాట్ కోహ్లీ..తన కుటుంబంతో కొన్ని రోజుల పాటు ఎంజాయ్ చేశాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందని…ప్రస్తుతం కోలుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో జూలై 1 నుంచి ప్రారంభం కావలసిన ఐదో టెస్టు నిర్వహణపై పలు సందేహాలు మొదలయ్యాయి. గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్ జరిగే సమయంలో భారత జట్టు సభ్యులకు కరోనా సోకడంతో మ్యాచ్ రద్దయింది. ఆ మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేశారు. జూలై 1 నుంచి బర్మింగ్‌హమ్‌లో 5వ టెస్టు ప్రారంభం కావలసి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా కలకలం సృష్టించడంతో ఇరు జట్ల ఆటగాళ్లలో ఆందోళన మొదలయింది.
ఇప్పటికే ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ మార్కస్ థ్రెస్కోతెక్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో జట్టుకు దూరంగా ఉన్నాడు. చికిత్స తీసుకుంటున్నాడు. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ కూడా అనారోగ్యంగా బాధపడుతున్నాడు. దీంతో బీసీసీఐ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో తిరగవద్దని, అభిమానులతో సెల్ఫీలు దిగవద్దని స్పష్టంగా ఆదేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ ఆటగాళ్లకు సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బారి నుంచి కోలుకున్న ప్లేయర్లపై ఎక్కవు లోడ్ లేకుండా చూడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో టెస్టు మ్యాచ్‌కు ముందు జరగాల్సిన వార్మప్ మ్యాచ్ అంత సీరియస్‌గా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. వార్మప్ మ్యాచ్‌ను కూడా సీరియస్‌గా తీసుకోవాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు.