కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తాడంటూ వార్తలు వెలువడ్డాయి.
Virat Kohli compliments to Rahul gandhi, Is is true?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. జవసత్వాలు కోల్పోయిన పార్టీకి కర్ణాటక ఫలితాలు ఓ బలమైన టానిక్లాగ పనిచేయనున్నాయి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేందుకు ఈ ఫలితాలు దోహదం చేయనున్నాయి. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తాడంటూ వార్తలు వెలువడ్డాయి.
సందట్లో సడేమియా
విరాట్ కోహ్లీ స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించాడంటూ ప్రచారం మొదలయింది. కోహ్లీ ఇన్స్టాగ్రామ్ పేజీ మాదిరిగా ఉన్న ఒక పేజీ విపరీతంగా సర్కులేట్ అయింది. చాలా మంది దీన్ని నమ్మేశారు. విరాట్ కోహ్లీ రాహుల్ గాంధీని అభినందించాడని నిజంగా నమ్మేశారు. కొన్ని గంటల తర్వాత అది నిజం కాదని తెలిసింది. రాహుల్ గాంధీని కోహ్లీ అభినందించలేదని తేలింది. ఎవరో ఒక వ్యక్తి కావాలని పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేశాడని నిర్ధారణ అయింది. మహ్మద్ జుబైర్ వంటి వ్యక్తులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో సమయంలో ఉన్న గెటప్‌తో కూడిన ఫోటోలను ఫేక్ వార్తలను వ్యాప్తి చేసేందుకు వాడుకున్నారు. విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఏ సాలా కప్ నమ్దే అనే క్యాప్షన్ ఉపయోగించింది. అంటే ఈ సారి కప్ మనదే అని దాని అర్ధం. కోహ్లీ పేరిట సర్కులేట్ అయిన పేజ్‌లో కూడా ఏ సాలా గవర్నమెంట్ నమ్దే అంటూ క్యాప్షన్ ఉపయోగించారు. నకిలీ పేజీని నిజమైన పేజీగా నమ్మించేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ అతితెలివి ప్రదర్శించిన వారిని డిజిటల్ మీడియా నిపుణులు పసిగట్టారు. కోహ్లీ పేరిట సర్కులేట్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నిజం కాదని తేల్చారు.
Virat Kohli never posted an Instagram story. Stop spreading your fake agenda by dragging athletes into your mess. @imVkohli this person is attributing fake quotes to you. He is a repeat offender. Such a vile account, there is nothing “parody” about it #ViratKohli #IPL2023 https://t.co/SisyZYBeCd
— Vishesh Roy (@vroy38) May 13, 2023