West Indies Tour: విరాట్ కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి, జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన కులదీప్
Virat Kohli and Jasprit Bumrah rested for the upcoming T20 series againt West Indies. వెస్టిండీస్ జట్టుతో త్వరలో జరగనున్న టీ 20 సిరీస్‌కు విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. కోహ్లీతో పాటు బుమ్రాకు కూడా సెటక్లర్లు విశ్రాంతినిచ్చారు. కులదీప్ యాదవ్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. చేతి వేలికి తగిలిన గాయం నుంచి కోలుకున్న కులదీప్‌కు సెలక్టర్లు జట్టులో స్థానం కల్పించారు. ఈ సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతి కల్పించిన సెలక్టర్లు నవంబర్‌లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్‌లో కోహ్లీ స్థానం విషయంలో సందేహాలు అక్కర్లేదని స్పష్టం చేశారు.
బుమ్రా గత కొంత కాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. దీంతో అతనికి విరామం ఇస్తే బాగుంటుందని భావించిన సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. టీ 20 వరల్డ్ కప్ సమయంలో మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలంటే, అంతకు ముందు విరామం మంచిదని సెలక్లర్లు భావించారు.
సౌతాఫ్రికాతో టీ 20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో కులదీప్ యాదవ్ చేతి వేలికి గాయం అయింది. దీంతో కులదీప్ బెంగళూర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. దీంతో సెలక్టర్లు అతడిని వెస్టిండీస్ టూర్‌కి ఎంపిక చేశారు.
5 మ్యాచుల సిరీస్ జూలై 29 నుంచి సిరీస్ ప్రారంభం
వెస్టిండీస్‌తో జరిగే టీ 20 సిరీస్ జూలై 29 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 7 వరకు కొనసాగనుంది. తొలి మ్యాచ్ ట్రినిడాడ్‌లో బ్రియాన్ లారా స్టేడియంలో జరగనుంది. తర్వాతి రెండు మ్యాచులు సెయింట్ కిట్స్ లోని వార్నర్ పార్కులో జరగనున్నాయి. చివరి రెండు మ్యాచులు ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్లో జరగనున్నాయి.
కోహ్లీని పక్కన పెట్టినా పర్వాలేదు
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 తేడాతో ముందుంది. గజ్జలో గాయం (groin Injury) కారణంగా విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆటకు దూరమయ్యాడు. 100 శాతం ఫిట్‌నెట్ లేకుండా బరిలో దిగితే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నందున కోహ్లీని పక్కన పెట్టారు. మరోవైపు కోహ్లీని జట్టులో తీసుకోపోయినా పర్వాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఫామ్‌లోని లేని కోహ్లీని పక్కన పెట్టి భీకరఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని క్రీడా పండితులు బీసీసీఐకి సలహా ఇస్తున్నారు.