ఆటలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ కోహ్లీ రెచ్చిపోతున్నాడు. తనను కొట్టే మొనగాడే లేడంటూ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు.
VIRAT KOHLI : ఐపీఎల్ (IPL)లో సెంచరీల మోత తర్వాత స్టార్ క్రికెటర్ (Star Crikcter)విరాట్ కోహ్లీ (Virat Kohli)ఇప్పుడు ఇన్స్టాగ్రామ్(INSTAGRAM)లోనూ చెలరేగిపోతున్నాడు. సోషల్ మీడియా (SOCIAL MEDIA0 షేరింగ్ యాప్ ఇన్ స్టాలో కోహ్లీ (KOHLI) కొత్త రికార్డు (NEW RECORD) సృష్టించాడు. ఇన్‌స్టాలో 250 మిలియన్ల మంది ఫాలోవర్ల మార్క్‌ను విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. 250 మిలియన్ల మంది ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న ఏకైక ఇండియన్ గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు మరే ప్లేయర్ కూ ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. దేశంలో మరే ప్లేయర్ కూ ఇంత మంది ఫాలోవర్లు లేరు. విరాట్ కోహ్లీ టీమిండియాకి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి కెప్టెన్ గా చాలా కాలం నుంచి ఆడుతున్నాడు.
వరల్డ్ వైడ్ మూడో స్థానం
ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల్లో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీకి ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. క్రికెట్ లో విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ మంది అభిమానులను కలిగి ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి ఇన్ స్టా గ్రామ్ లో కేవలం 4 కోట్ల మందే ఫాలోవర్లు ఉన్నారు. లెజెండ్ క్రికెటర్ సచిన్ ను 3.79 కోట్ల మందే ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అవుతున్నారు.
ఒక్కో పోస్ట్ కు ఐదు కోట్లు
వినియోగదారులను ప్రభావితం చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలకు ఇన్ స్టా భారీగా చెల్లిస్తుంది.. ఇందులో భాగంగా విరాట్ కోహ్లిని కూడా సోషల్ మీడియా ప్రభావితదారుల్లో టాప్ ప్లేస్ లో చేరింది. ఇన్ స్టా ఒక్కో పోస్టుకు విరాట్ కోహ్లీ రూ. 5 కోట్లు తీసుకుంటున్నాడు. క్రికెటర్లలో విరాట్ కోహ్లీనే టాప్. ఇంతకు ముందే యూకేకు చెందిన హాపర్ హెచ్ క్యూ సంస్థ వెల్లడించింది. 2021 గాను ఈ సంస్థ ప్రకటించిన ఇన్ స్ట్రా గ్రామ్ ధనవంతుల జాబితాలో కోహ్లీ 19వ స్థానంలో నిలిచారు. టాప్-20లో నిలిచిన ఏకైక భారతీయుడు కూడా కోహ్లీనే. ఈ జాబితాలో ఫుట్ బాల్ దిగ్గజం ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నారు. రొనాల్డో ఒక్కో పోస్టుకు దాదాపు రూ. 11 కోట్లు తీసుకుంటుండగా. రొనాల్డోకు 300 మిలియన్లకు పైగా ఫాలవర్స్ ఉన్నారు. ఇన్‌స్టా వేదికగా 150 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న మొదటి భారత సెలబ్రిటీగానూ కోహ్లీ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం విరాట్‌కు 177 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి రూ. 8.6 కోట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.