Umesh Yadav: భారత్ స్టార్ బౌలర్ ఇంట సంబరాలు, మరోసారి తండ్రి అయిన ఉమేశ్ యాదవ్
Umesh Yadav and His Wife Tanya Blessed With Baby Girl
భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ తండ్రి అయ్యాడు. ఉమేశ్ భార్య తన్యా కుమార్తెకు జన్మనిచ్చింది. తాను తండ్రిని అయ్యానని ఉమేశ్ యాదవ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఉమేశ్ ఈ విషయం వెల్లడించిన కొద్దిసేపటికే నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున ఉమేశ్ ఇంట్లో మహిళ వచ్చిందని మరికొందరు నెజిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఉమేశ్ యాదవ్ 2021లో మొదటి సారి తండ్రి అయ్యాడు. అప్పుడు కూడా అమ్మాయే పుట్టింది. 2021లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సమయంలో ఉమేశ్ యాదవ్ తండ్రి అయిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు భారతదేశంలో పర్యటిస్తోంది. ఈ సమయంలో కూడా ఉమేశ్ తండ్రి అయ్యాడనే వార్త క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఉమేశ్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఉమేశ్ యాదవ్ రివర్స్ స్వింగ్ ఆసీస్ పతనానికి కారణమయింది. కేవలం 12 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయాయి.
నాల్గవ టెస్టు మ్యాచ్
ఆస్ట్రేలియా భారత జట్ల మధ్య ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. ఇప్పటికే మూడు మ్యాచులు జరిగాయి. భారత జట్టు మొదటి రెండు మ్యాచులు గెలిచింది. మూడో మ్యాచ్ లో ఆసీస్ ఘన విజయం సాధించింది. నాల్గవ టెస్టు రేపటి నుంచి ప్రారంభం కానుంది. భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని కూడా మ్యాచ్ చూసేందుకు వస్తున్నారు. దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Umesh Yadav and his wife Tanya are blessed with a baby girl. Many congratulations to both of them. pic.twitter.com/RQvrVkraPk
— Cricket Updates (@TheCricPerson) March 8, 2023
Umesh Yadav & His Wife Tanya Are Blessed With A Baby Girl.
Many Congratulations To Both Of Them!
— Krish Sheth (@krishsheth2006) March 8, 2023
Umesh Yadav