హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో రెండు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు విజయం సాధించింది. సన్‌రైజర్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో సాధించిన 57 పరుగుల ద్వారా రోహిత్ శర్మ ముంబై జట్టు తరపున 5000 పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు.
Two more records for Hit man Rohit sharma
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో రెండు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు విజయం సాధించింది. సన్‌రైజర్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో సాధించిన 57 పరుగుల ద్వారా రోహిత్ శర్మ ముంబై జట్టు తరపున 5000 పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు.
241 మ్యాచులు … 6191 పరుగులు
రోహిత్ శర్మ ఇప్పటి వరకు 241 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. 6191 పరుగులు సాధించాడు. ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఇప్పటి వరకు 5000 పరుగులు చేశాడు. డెక్కన్ ఛార్జర్స్ తరపున ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన రోహిత్ శర్మ కొన్నేళ్ల తర్వాత ముంబై ఇండియన్స్ జట్టుకు మారాడు. సింగిల్ ఫ్రాంచైజీ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఘనత మాత్రం కోహ్లీ పేరిట ఉంది. బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరపున 2008 నుండి ఆడుతున్న కోహ్లీ ఇప్పటి వరకు 7162 పరుగులు చేశాడు.
అదే విధంగా టీ 20 కెరీర్లో 11 వేల పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో ఇప్పటికే విరాట్ కోహ్లీ చేరుకుని ఉన్నాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. 11 వేల పరుగుల మైలురాయిని సాధించిన విదేశీ ఆటగాళ్లలో క్రిస్‌గేల్, షోయబ్ మాలిక్, కిరన్ పొలార్డ్, డేవిడ్ వార్నర్‌లు ఉన్నారు.
5000 Runs For Mumbai Indians & 11000 Runs In T20s!!!@ImRo45 pic.twitter.com/tuFOuyJfzj
— Rohit Sharma Trends™ (@TrendsRohit) May 21, 2023
Well played Captain 💙
Rohit Sharma completed 11000 runs in T20 format.
Captain, Leader, Legend, Hitman.#MIvSRH pic.twitter.com/GBJVeJIq4y— ANKIT SHARMA (@AnkitSharma8878) May 21, 2023
History 🚨
1.Rohit Sharma completed 5000 runs for Mumbai Indians.
2.Rohit Sharma completed 11000 runs in T20 Cricket.
That's out of form Rohit Sharma ! 💀 pic.twitter.com/iwwc0wUlg1
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧⁶⁹ (@ImHydro45) May 21, 2023
42వ హాఫ్ సెంచరీ
సన్‌రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరీర్లో 42వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ టోర్నీలో రోహిత్ శర్మకు ఇది రెండవ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఒక దశలో 19 బంతులకు 22 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ 9వ ఓవర్లో వీరవిహారం చేశాడు. వివ్రాంత్ శర్మ వేసిన ఆ ఓవర్లో పరుగుల వరద పారించాడు. ఆ తర్వాత ఉమ్రాన్ మాలిక్ వేసిన ఓవర్లోను హిట్‌మ్యాన్ చెలరేగి ఆడాడు. హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి సత్తా చాటాడు. కార్తీక్ త్యాగి వేసిన 12వ ఓవర్లో బౌండరీ కొట్టడం ద్వారా రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 31బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఆ తర్వాత జోరు కొనసాగించలేకపోయాడు. 56 పరుగుల వద్ద ఔటయ్యాడు.