Lionel Messi: ఫుట్ బాల్ స్టార్ మెస్సీకు రూ. 3000 కోట్ల బంపర్ ఆఫర్
Two Foot ball clubs in Saudi arabia are willing to pay € 350 million to Lionel Messi
ఫుట్ బాల్ ప్రపంచంలో అత్యంత క్రేజ్ కలిగిన ప్లేయర్, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ కు ఒక బంపర్ ఆఫర్ తగిలింది.సౌదీ అరేబియాలోని రెండు ఫుట్ బాల్ క్లబ్స్ మెస్సీకి భారీ ఆఫర్ ప్రకటించాయి. తమ క్లబ్ తరపున ఆడితే సంవత్సరానికి 350 మిలియన్ యూరోలను ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. 350 మిలియన్ డాలర్లంటే భారత కరెన్సీలో 3000 కోట్లతో సమానం. అల్ ఇతిహాద్, అల్ హిలాల్ అనే రెండు ఫుల్ బాల్ క్లబ్స్ మెస్సీ ముందు ఈ ఆఫర్ ఉంచాయి.
ఇప్పటికే అల్ నాసర్ అనే పేరు గల ఫుల్ బాల్ క్లబ్, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకి 200 మిలియన్ యూరోలను ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని రోజుల తరపున క్రిస్టియానో బరిలో దిగనున్నాడు. ప్రస్తుతం రినాల్డో పై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇంగ్లండ్ ఫుట్ బాల్ అసోసియేషన్ నిషేదం విధించింది.
కొన్ని నెలల క్రితం మాంచెస్టర్ యునైటెడ్ ఓడిపోయిన సందర్భంగా సంయమనం కోల్పోయిన రోనాల్డో ఓ అభిమాని చేతిలో ఫోన్ లాక్కుని బద్దలు కొట్టాడు. దీంతో అతడిపై ఇంగ్లండ్ ఫుట్ బాల్ అసోసియేషన్ బ్యాన్ విధించింది. దీంతో అల్ నాసర్ తరపున మొదటి రెండు మ్యాచులు ఆడేందుకు వీలు పడలేదు. జనవరి 22వ తేదీన జరిగే మ్యాచ్ లో రొనాల్డో ఆడతాడని అల్ నాసర్ కోచ్ రుడీ గార్సియా తెలిపాడు.
సౌదీ అరేబియాలో ఫుట్ బాల్ క్లబ్బులు పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. అల్ నాసర్ క్లబ్ క్రిస్టియానో రొనాల్డోను భారీ ఒప్పందం కుదుర్చుకోవడంతో, అల్ నాసర్ క్లబ్ పోటీదారులైన అల్ హిలాల్, అల్ ఇతిహాద్ లు మెస్సీ వైపు మొగ్గు చూపుతున్నాయి. భారీ ఆఫర్ ప్రకటించాయి. మెస్సీ ఈ డీల్ ని అంగీకరిస్తాడా లేదా అనే విషయంలో ఇంకా తెలియాల్సి ఉంది.