IND vs SL 3rd ODI: నేడు లంకతో భారత్ చివరి వన్డే
IND vs SL 3rd ODI:భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు మూడో వన్డే తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరుగనుంది. వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పడు మూడో వన్డేలోనూ గెలిచి శ్రీలంకను వైట్ వాష్ చేయాలని భావిస్తోంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటివరకు ఒకే ఒక్క వన్డే మ్యాచ్ జరిగింది గ్రీన్ ఫీల్డ్ మైదానంలో. వెస్టిండీస్- టీమిండియా మధ్య జరిగిన ఆ మ్యాచ్ లో విండీస్ పై భారత్ విజయం సాధించింది.
రెండో వన్డేలో ఆడిన టీమ్‌ను యధావిధిగా కొనసాగించే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మార్పులు చేయాలనుకుంటే ఓపెనర్ గిల్, శ్రేయస్ అయ్యర్‌ను పక్కనబెట్టి సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌ను గ్రౌండ్ లోకి దింపే అవకాశాలున్నాయనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండు వన్డేల్లో ఓడిన లంక ఎలాగైనా ఈ మ్యాచ్ నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తుంది.