Ind Vs SL: నేడు రాజ్‌కోట్‌లో మూడో టీ 20 మ్యాచ్, అర్షదీప్‌పై వేటు పడే ఛాన్స్
Third T 20 match in Rjkot, Arshadeep may not be included
భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న టీ 20 సిరీస్ చివరి దశకు చేరుకుంది. నిర్ణయాత్మకమైన మూడవ మ్యాచ్ ఈ రోజు రాజ్‌కోట్‌లో జరగనుంది. ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత జట్టు 2 పరుగుల తేడాతో గెలవగా..రెండో మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 16 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఈ టీ 20 సిరీస్ 1-1 స్కోర్‌తో సమంగా మారింది. మూడో మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారికే సిరీస్ సొంతం కానుంది. దీంతో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం కనిపిస్తోంది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా జట్టులో ఎటువంటి మార్పులు చేస్తాడనే విషయం ఆసక్తిగా మారింది.
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ ఆడిస్తారా లేదా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే చాలా మంది మాజీలు అర్షదీప్‌ను పక్కన పెట్టాలని కోరుతున్నారు. గాయం నుంచి కోలుకుని వచ్చిన వారిని కొన్ని రోజుల పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడించాలని, అక్కడ ప్రాక్టీస్ లభించిన అనంతరమే తిరిగి జట్టులోకి తీసుకోవాలని మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ బీసీసీఐకి సూచించాడు.
గాయం కారణంగా మొదటి టీ 20 మ్యాచ్‌కి అందుబాటులో లేకపోయిన అర్షదీప్ సింగ్ రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. తాను వేసిన మొదటి ఓవర్‌లోనే భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. నో బాల్స్ వేయడంతో లంక జట్టుకు కలిసి వచ్చింది. లంక ఆటగాళ్లు రెండో ఓవర్ నుంచే జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టించారు. అర్షదీప్ బౌలింగ్ లంకేయులకు కలిసివచ్చింది.
పూణెలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ శనక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చివరి మూడు ఓవర్లలో 60 పరుగులు చేశారు. ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్ వేసిన చివరి మూడు ఓవర్లలో లంక ఆటగాళ్లు చెలరేగి ఆడి పరుగులు వరద పారించారు. మొత్తంగా 206 పరుగులు చేశారు.
భారీ టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా చతికిలపడింది. టాపార్డర్ పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక్క సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతావాళ్లందరూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. సూర్య కుమార్‌తో పాటు అక్షర్ పటేల్ కూడా వీర విహారం చేయడంతో టీమిండియాకు పరువు దక్కింది. భారీ తేడాతో ఓడిపోకుండా తక్కువ పరుగుల తేడాతోనే పరాజయం పాలయింది.
మరికొన్ని గంటల్లో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువ. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచులే దీనికి తార్కాణం. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఏకంగా 195 పరుగులు చేశాయి. అదే ఊపు ఈ రోజు జరిగే మ్యాచ్‌లోనూ కనిపించే ఛాన్స్ ఉంది.
సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గతంలో టీమిండియా నాలుగు మ్యాచులు ఆడింది. వాటిలో మూడు మ్యాచులు భారత్ గెలిచింది. 2017లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలయింది.