IPL : ఐపీఎల్‌లో ఆడడమే తన ఆశయం అంటున్న ఐర్లాండ్ కెప్టెన్
Target IPL: ఏ క్రికెటర్ అయినా మొదట జాతీయ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా దేశవాలి క్రికెట్‌లో ఆడుతాడు. జాతీయ జట్టుకు ఎన్నికైన తర్వాత తమ దేశానికి ప్రపంచకప్ అందిచడమే తన ఆశయమని అంటారు. కానీ ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్య్రూ బాల్ బిర్నీ మాత్రం ఐపీఎల్‌లో ఆడడం తన ఆశయమంటున్నాడు. ఈ నెల 26 నుంచి ఐర్లాండ్‌తో భారత్ రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బిర్నీ.. ఐపీఎల్‌లో చోటు కోసం ఎంత పోటీపడాలో తనకు అవగాహన ఉందని, అది తన ఆశయం అన్నాడు. టీ20 క్రికెట్‌లో అదే అత్యున్నత శిఖరమని, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చోటు దక్కిన తర్వాత ఆటగాళ్లు ఎంత వేగంగా ఆటతీరును మెరుగుపరుచుంటున్నారో చూస్తున్నానని బిర్నీ వివరించాడు.
మరోవైపు ఇంగ్లండ్‌తో టెస్ట్ కోసం ఓ జట్టు వెళ్లింది. ఐర్లాండ్‌కు మరో జట్టు వచ్చిందని కెప్టెన్ ఆండ్య్రూ బాల్ బిర్నీతెలిపాడు. టీ20 జట్టులోని భారత ఆటగాళ్లు పూర్తి స్థాయి ప్రధాన జట్టులో చోటు కోసం చూస్తుంటారు. కనుక వారిపైనా ఒత్తిడి ఉంటుందని, త్వరలో న్యూజిలాండ్‌తో ఆడుతుందని, అనంతరం టీ20 ప్రపంచకప్ జరగనుందన్నాడు. కనుక ఇరువైపులా ఆటగాళ్లకు తాము ఏంటో నిరూపించుకునే అవకాశం ఐర్లాండ్ కెప్టెన్ పేర్కొన్నాడు.