India vs Pakistan CWG 2022 : ఆసక్తికరంగా దాయాదుల సమరం
The India vs Pakistan CWG 2022 match will be played at Edgbaston, Birmingham : ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మహిళలతో తలపడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు కామన్వెల్త్ గేమ్స్ 2022లో తమ తొలి విజయాన్ని లక్ష్యంగా చేసుకుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
CWG ఓపెనర్‌లో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా మహిళలపై భారత మహిళల క్రికెట్ జట్టు మూడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. స్కిప్పర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక అర్ధసెంచరీతో ముందుండి నడిపించింది. హర్మన్‌ప్రీత్ కీలకమైన 52 పరుగులతో భారత్ 20 ఓవర్లలో 154 పరుగుల భారీ స్కోరును చేరుకుంది. భారత క్రీడాకారిణి రేణుకా సింగ్ అద్భుత బౌలింగ్‌తో నాలుగు వికెట్లు పడగొట్టింది. అయితే ఆస్ట్రేలియా మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకోవడంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు పాకిస్తాన్ మహిళలు బార్బడోస్‌తో 15 పరుగుల తేడాతో ఓటమిని చవిచూశారు.
ఇక కామన్వెల్త్ గేమ్స్ 2022 జులై 31, ఆదివారం భారత మహిళలు, పాకిస్తాన్ మహిళల మధ్య మ్యాచ్ జరగనుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, పాకిస్థాన్ మహిళల మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
అంచనా ప్రకారం ఇండియా విమెన్ టీం స్టార్టింగ్ లైనప్ లో స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, రాధా యాదవ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్ ఉన్నారు.
పాక్ మహిళల టీం ప్రారంభ లైనప్ లో మునీబా అలీ (వికెట్ కీపర్), ఇరామ్ జావేద్, బిస్మా మరూఫ్ (కెప్టెన్), ఒమైమా సోహైల్, అలియా రియాజ్, నిదా దార్, అయేషా నసీమ్, తుబా హసన్, అనమ్ అమీన్, ఫాతిమా సనా, డయానా బేగ్ ఉండే అవకాశం ఉంది.