Ind Vs SA: టీమ్ ఇండియాదే సీరిస్…
Ind Vs SA: నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్ధేశించిన 99 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 105 పరుగులు సాధించి విజయం సొంతం చేసుకున్నది. మూడు వన్డేల సీరిస్‌లో టీమ్ ఇండియా జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. వంద పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు 42 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. శిఖర్ ధావన్ 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యాడు.
అనంతరం ఇషాన్ కిషన్ కూడా కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. అయితే, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సమయోచితంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, శ్రేయాస్ అయ్యర్ 22 పరుగులు, శాంసన్ 4 పరుగులు చేశారు. దీంతో టీమ్ ఇండియా జట్టు కేవలం 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి సౌతాఫ్రికా భారత స్పిన్నర్ల ధాటికి 99 పరుగులకే ఆలౌట్ అయింది. కుల్ధీప్ 4, సుందర్, సిరాజ్, షాబాద్ అహ్మద్‌లు తలా రెండు వికెట్లు తీసుకున్నారు.