Ind Vs NZ T 20 Match: టీమ్ ఇండియా ఘన విజయం… టీ 20 సీరిస్ కైవసం
Ind Vs NZ T 20 Match: అహ్మాదాబాద్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది. మూడు టీ 20 సీరిస్‌ను ఇండియా జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకున్నది. ఇప్పటికే మూడు వన్డేల సీరిస్‌ను 3-0 తేడాతో విజయం సాధించగా, తాజాగా టీ 20 సీరిస్‌ను సైతం కైవసం చేసుకొని బ్లాక్ క్యాప్‌లకు షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించింది. శుబ్‌మన్ గిల్ టీ 20 మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. కేవలం 63 బంతుల్లో 126 పరుగులు చేశాడు. మరోవైపు రాహుల్ త్రిపాఠి 44 పరుగులు చేయడంతో టీమిండియా జట్టు భారీ స్కోర్ సాధించింది.
235 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్‌క్యాప్ జట్టును భారత ఫేసర్లు కుప్ప కూల్చారు. 12 ఓవర్లలోనే న్యూజిలాండ్ జట్టు చేతులెత్తేసింది. 66 పరుగులకే ఆలౌట్ అయింది. డరైల్ మిచెల్, శాంటర్న్ మాత్రమే రెండక్కల స్కోర్‌ను సాధించారు. టీమ్ ఇండియా బౌలింగ్ విభాగంలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీసుకోగా, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి తలా రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా, మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును శుబ్‌మన్ గిల్ సొంతం చేసుకోగా, సీరిస్‌లో అన్ని విభాగాల్లో రాణించిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది సీరిస్ అవార్డ్ దక్కింది.