Ind Vs Aus: ఆసిస్‌పై భారత్ ఘనవిజయం
Ind Vs Aus: ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సీరిస్‌లో భాగంగా మొదటి వన్డే నేడు ముంబై వేదికగా జరిగింది. ఈ వన్డేలో భారత్ శుభారంభం చేసింది. టాస్ గెలిచిన భారత్ జట్టు ఆసిస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ జట్టు 35.4 ఓవర్లలోనే 188 పరుగులకు ఆలౌట్ అయింది. 189 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ జట్టు ఆదిలోనే వరసగా వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిపోయింది. అయితే, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు సమయోచితంగా ఆడటంతో భారత్ జట్టు విజయం సాధించింది. కేఎల్ రాహుల్ 75 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 45 పరుగులు చేసింది. ఆరో వికెట్‌కు వీరిద్దరూ 108 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని సాధించారు. మూడు వన్డేల సీరిస్‌లో భారత్ 1-0తో ఆధిక్యాన్ని సాధించింది.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ జట్టును భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కేవలం 188 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, గిల్ తక్కువ పరుగులకే ఔటైనప్పటికీ కేఎల్ రాహుల్, జడేజాల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. పరుగులు తక్కువే అయినప్పటికీ టాప్ ఆర్డర్ విఫలం కావడంతో మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన జడేజా కేఎల్ రాహుల్‌కు అండగా నిలబడ్డాడు.