India VS Australia: డ్రాగా ముగిసిన చివరి టెస్టు, బోర్డర్ గవాస్కర్ సిరీస్ భారత్ కైవసం
Team India wins Border Gavaskar Series by 2-1
బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ఈ సిరీస్ ను భారత జట్టు 2-1 తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 2 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 90 పరుగులు చేయగా…మార్నస్ లబుషేన్ 63 పరుగులు చేశాడు. ఈ సమయంలో గెలుపు అవకాశాలు ఏ జట్టుకు లేవని తేలడంతో అంపైర్లు ఫలితాన్ని నిర్ణయించారు. మ్యాచ్ డ్రా అయినట్లు ప్రకటించారు.
తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ జట్టు 480 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత జట్టు కూడా అదిరిపోయే ఆటతీరును కనబరిచింది. 571 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 128 పరుగులు చేయగా..విరాట్ కోహ్లీ ఏకంగా 186 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. దీంతో భారత జట్టు 571 పరుగులు చేసింది. ఆసీస్ జట్టుపై ఆధిక్యం కనబరిచింది.
నాల్గవ టెస్టు చివరి రోజున ఇరుజట్లు పట్టుదలగా ఆడాయి. వికెట్లు తీసేందుకు భారత్ ప్రయత్నించగా…. వికెట్లు కాపాడుకోడానికి ఆసీస్ ప్రయత్నించింది. ఇరుజట్లకు విజయావకాశాలు లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొత్తం 4 టెస్టు మ్యాచులు జరిగాయి. తొలి రెండు టెస్టు మ్యాచులను భారత్ గెలిచింది. మూడో టెస్టును ఆసీస్ జట్టు గెలిచింది. చివరి టెస్టు డ్రా గా ముగిసింది. దీంతో ఈ సిరీస్ 2-1 తేడాతో భారత్ గెలిచినట్లయింది.
The fourth Test ends in a draw as India take the series 2-1 👏#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/DSrUTbdMEO
— ICC (@ICC) March 13, 2023
India 🇮🇳 🤝🏻 Australia 🇦🇺
The final Test ends in a draw as #TeamIndia win the Border-Gavaskar series 2-1 🏆#INDvAUS pic.twitter.com/dwwuLhQ1UT
— BCCI (@BCCI) March 13, 2023