IND vs NED: నేడు నెదర్లాండ్స్‌తో తలపడనున్న టీమిండియా
IND vs NED: గత ఆదివారం టీ 20 ప్రపంచ కప్ లో పాక్‌పై విక్టరీ సాధించిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా నేడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా దీపావళి ఒక రోజు ముందు ఆడిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. ఇప్పుడు అదే ఊపు మీద ఉన్న టీమిండియా నెదర్లాండ్స్‌తో నేడు మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో తమ తొలి నెట్ సెషన్‌ను పూర్తి చేశారు. ఇప్పటి వరకు భారత్, నెదర్లాండ్స్ మధ్య ఒక్క టీ20 మ్యాచ్ కూడా జరగలేదు.
నెదర్లాండ్స్ UAE, నమీబియాలను ఓడించి మూడు గేమ్‌లలో రెండు గెలిచింది. గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన నమీబియా జట్టు.. పెద్ద జట్లకు కూడా ఝలక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌పై నెదర్లాండ్స్ బౌలర్లు బంగ్లాదేశ్‌ను 20 ఓవర్లలో 144 పరుగులకే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కేవలం 9 పరుగుల తేడాతో గెలిచింది. ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటలకు భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఇండియా – రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.
నెదర్లాండ్స్ – మాక్స్ ఆడ్, విక్రమ్‌జిత్ సింగ్, బాస్ డి లీడ్, టామ్ కూపర్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, టిమ్ ప్రింగిల్, టిమ్ వాన్ డెర్ గుటెన్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్.