IND Vs BAN: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన భారత్, 409 పరుగుల భారీ స్కోర్
Team India Scored 409 runs against Bangladesh in 3rd ODI
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు వీరవిహారం చేసింది. 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లా బౌలర్లను హడలెత్తించిన ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. వీరిద్దరి దూకుడుతో భారత జట్టు 400 పరుగుల మైలురాయిని దాటింది.
ఇషాన్ కిషన్ 210 పరుగులు, విరాట్ కోహ్లీ 113 పరుగులు చేయగా..వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు, అక్షర్ పటేల్ 20 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారు.
అంతర్జాతీయ స్థాయిలో 6 జట్లు మాత్రమే 400 పరుగుల మైలురాయిని దాటి స్కోర్లు చేశాయి. ఈ ఆరు జట్లలో మొట్ట మొదటి చెప్పుకోవలసి జట్లు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు.
2006లో వన్డేల్లో తొలిసారిగా 400 పరుగుల భారీ స్కోర్ నమోదయింది. రెండు జట్లు పోటాపోటీగా ఆడి 400 పరుగులను అవలీలగా చేశాయి. ఆస్ట్రేలియా జట్టు 434 పరుగులు చేస్తే..సౌతాఫ్రికా 438 పరుగులు చేసి తమ సత్తా చాటుకుంది.
2007లో జరిగిన ఓ మ్యాచ్‌లో ఇండియా తొలిసారిగా 400 పరుగుల మైలురాయిని దాటి స్కోర్ చేసింది. పసికూనలైన బెర్ముడా జట్టుపై 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన భారత్ 413 పరుగులు చేసింది.
ఆ తర్వాత 2009లో కూడా భారత్, శ్రీలంక జట్లు 400 పైగా స్కోర్లు చేశాయి. భారత్ 414 పరుగులు చేస్తే, శ్రీలంక 411 పరుగులు చేయగలిగింది.
2009-10లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 401 పరుగులు చేసింది. 2011-12లో వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కూడా భారత జట్టు 418 పరుగులు చేసింది.
2014-15లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 404 పరుగులు చేసింది.2022 జూన్ 17న నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏకంగా 498 పరుగులు చేసింది.
400 పరుగులకు పైగా స్కోర్ చేసిన మ్యాచుల్లో భారత్ గెలుపొందింది. అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది.
Brilliant knocks from Ishan Kishan and Virat Kohli have helped India to a total of over 400 👏#BANvIND | https://t.co/SRyQabJAHN pic.twitter.com/YchindVRDm
— ICC (@ICC) December 10, 2022