India Vs NZ: మూడో వన్డేలో భారత్ పరుగులు వరద, కివీస్ టార్గెట్ 386 రన్స్
Team India Scored 385 runs in 3rd ODI against New Zealand
మూడో వన్డేలో భారత జట్టు 385 పరుగులు చేసింది. కివీస్ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ సెంచరీలతో కదం తొక్కారు. వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 54 పరుగులు చేయగా..విరాట్ కోహ్లీ 36 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. మొత్తం మీద 50 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత జట్టు 385 పరుగులు చేసింది.
భారత ఓపెనర్లు ఇద్దరు మొదటి నుంచి బాదుడు మొదలు పెట్టారు. బౌలర్లపై విరుచుకుపడ్డారు. సెంచరీలతో కదం తొక్కారు. రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 బౌండరీలు, 6 సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేసుకోగా, 72 బంతుల్లో శుభ్ మన్ గిల్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసిన కొద్ది సేపటికే గిల్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మకు ఇది 30వ వన్డే సెంచరీ కాగా..గిల్ కు 4వ వన్డే సెంచరీ కావడం విశేషం.
కివీస్ బౌలర్లలో జాకోబ్ డఫ్పీ దారుణంగా వైఫల్యం చెందాడు. 10 ఓవర్లలో 100 పరుగులు సమర్పించుకున్నాడు. మరో బౌలర్ బ్లెయిర్ టిక్నర్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చాడు. లాకీ ఫెర్గసన్, మిచెల్ సాంట్నర్ భారత బ్యాటర్లను కాస్త కట్టడి చేయగలిగారు.
.@ShubmanGill scored a fantastic hundred & was our top performer from the first innings of the third #INDvNZ ODI 👌 👌 #TeamIndia | @mastercardindia
A summary of his knock 🔽 pic.twitter.com/uJAYfPLUCx
— BCCI (@BCCI) January 24, 2023
Innings Break!
A mighty batting display from #TeamIndia! 💪 💪
1⃣1⃣2⃣ for @ShubmanGill
1⃣0⃣1⃣ for captain @ImRo45
5⃣4⃣ for vice-captain @hardikpandya7Over to our bowlers now 👍 👍
Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf#INDvNZ | @mastercardindia pic.twitter.com/JW4MXWej4A
— BCCI (@BCCI) January 24, 2023