First One Day Match: 40 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసిన భారత్
భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్ ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ అదరహో అనిపించారు. 119 పరుగుల పటిష్ట భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శుభ్‌మన్ గిల్ రనౌట్ అయ్యాడు. 18వ ఓవర్లో గిల్ ఔటైన తర్వాత బరిలోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్‌కు జతకట్టాడు. వీరిద్దరూ 200 పరుగుల మైలురాయిని దాటించారు. 32 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత జట్టు ఒక వికెట్ కోల్పోయి 202 పరుగులు చేసింది.
శిఖర్ ధావన్ సెంచరీ మిస్
34వ ఓవర్ వద్ద భారత్ మరో వికెట్ కోల్పోయింది. సెంచరీకి చేరువలో ఉన్నశిఖర్ ధావన్ ఔటయ్యాడు. 97 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మోతీ కన్హాయీ బౌలింగ్‌లో బ్రూక్స్ పట్టిన అద్భుత క్యాచ్ ద్వారా వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 99 బంతులను ఎదుర్కొన్న శిఖర్ ధావన్ 10 ఫోర్లు, 3 సిక్సులు కొట్టాడు. ధావన్ ఔటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగాడు. శ్రేయాస్ అయ్యర్‌కు జత కలిశాడు.
టాస్ గెలిచిన విండీస్
టాస్ గెలిచిన విండీస్ సారధి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రవీంద్ర జడేజా అనారోగ్య కారణాలతో మొదటి రెండు మ్యాచులకు దూరమయ్యాడు. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించి గట్టి పునాది వేశారు. 35 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. ఆ తర్వాతి 5 ఓవర్లలో భారత జట్టు మరో 23 పరుగులు జోడించింది. రెండు వికెట్లు కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ 54 పరుగుల వద్ద ఔటవ్వగా, సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులకు వెనుదిరిగాడు.దీంతో 40 ఓవర్ల తర్వాత భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. సంజు సాంసన్, దీపక్ హుడాలు బరిలో ఉన్నారు.
Maiden ODI fifty for Shubman Gill 💪
Watch #WIvIND for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 pic.twitter.com/XUN0x0TQS6
— ICC (@ICC) July 22, 2022
Half-century for the captain 👏
Watch #WIvIND for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 pic.twitter.com/swxtFAOSWU
— ICC (@ICC) July 22, 2022
A look at our Playing XI for the 1st ODI.
Live – https://t.co/tE4PtTfY9d #WIvIND pic.twitter.com/WuwCljou75
— BCCI (@BCCI) July 22, 2022