India Vs SL: సెంచరీతో కదం తొక్కిన సూర్య, 228 పరుగులు చేసిన భారత్
Team India Scored 228 runs in the Third 20 Match
శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్‌లో భారత జట్టు 228 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ వీరవిహారం చేశాడు. కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు 7 బౌండరీలు బాదాడు. టాపార్డర్‌లో రాహుల్ త్రిపాఠీ 35 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ 46 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ కూడా చెలరేగి ఆడాడు. కేవలం 9 బంతుల్లో 4 ఫోర్లు కొట్టి 21 పరుగులు చేశాడు.
మొదటి 10 ఓవర్లలో 92 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాతి 10 ఓవర్లలో 136 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. స్టేడియం అన్ని వైపులకు బంతిని తరలించాడు. ఆకాశమే హద్దుగా చెలగేరి ఆడాడు. 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
సూర్యకు ఇది మూడవ టీ 20 సెంచరీ కావడం విశేషం.సెంచరీ పూర్తయిన తర్వాత కూడా ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు. మరో 6 బంతులు ఎదుర్కొన్నాడు. 12 పరుగులు చేశాడు. మొత్తంగా 51 బంతుల్లో 112 పరుగులు చేశాడు.
20 పూర్తయ్యే సరికి భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. దిల్షాన్ మధుశంక 2 వికెట్లు తీశాడు. కసన్ రజిత, చమికా కరుణరత్నే,వాసిందు హసరంగ ఒక్కో వికెట్ పడగొట్టారు.
CENTURY for @surya_14kumar
A third T20I 💯 in just 43 innings.
Take a bow, Surya!#INDvSL @mastercardindia pic.twitter.com/HZ95mxC3B4
— BCCI (@BCCI) January 7, 2023
𝓢𝓮𝓷𝓼𝓪𝓽𝓲𝓸𝓷𝓪𝓵 𝓢𝓾𝓻𝔂𝓪 👏👏
3⃣rd T20I ton for @surya_14kumar & what an outstanding knock this has been 🧨 🧨#INDvSL @mastercardindia pic.twitter.com/kM1CEmqw3A
— BCCI (@BCCI) January 7, 2023