India Batting: నాల్గవ టీ 20 మ్యాచ్‌లో 191 పరుగులు చేసిన భారత్
వెస్టిండీస్‌తో జరుగుతున్న నాల్గవ టీ 20 మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. విండీస్ జట్టుకు 192 పరుగులు టార్గెట్ ఇచ్చింది. దినేశ్ కార్తీక్ మినహా మిగతా అందరూ డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. రిషబ్ పంత్ అందరి కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 31 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఆ తర్వాత అత్యధిక స్కోర్ చేసింది కెప్టెన్ రోహిత్ శర్మ. శర్మ 16 బంతుల్లో 33 పరుగులు చేశాడు.
ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ 24 పరుగులు చేయగా, ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా 21 పరుగులు చేశాడు. సంజు సాంసన్, అక్షర్ పటేల్ చివరి వరకు బరిలో నిలిచారు. సంజు 30 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 20 పరుగులు చేశాడు. మెకాయ్, అల్జరీ జోసెఫ్‌లు ఇద్దరూ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అకీల్ హోసియన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
అమెరికాలో క్రికెట్‌పై ఆసక్తిని పెంచే ఉద్దేశ్యంతో ఈ సిరీస్‌లోని చివరి రెండు మ్యాచులను అమెరికాలో ఆడిస్తున్నారు. నాల్గవ మ్యాచ్ ప్రస్తుతం లాడర్ హిల్‌లో జరుగుతోంది.