WTC Final: భారతజట్టుకు కలిసి వచ్చిన శ్రీలంక ఓటమి, WTC ఫైనల్ పోరుకు అర్హత
Team India qualifies for World test Championship Finals
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరుకు భారత జట్టు అర్హత సాధించింది. ఆసీస్ జట్టుతో ప్రస్తుతం జరుగుతున్న నాల్గవ టెస్టు ఫలితంలో సంబంధం లేకుండానే తుదిపోరుకు అర్హత సాధించింది. న్యూజిలాండ్ జట్టు శ్రీలంకను ఓడించిన కారణంగా భారత్ WTC తుదిపోరుకు అర్హత సాధించింది.
కివీస్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ చివరి వరకు ఎంతో ఉత్కంఠగా జరిగింది. చివరికు న్యూజిలాండ్ జట్టును విజయం వరించింది. ఓటమి పాలైన శ్రీలంక జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పోటీలకు అర్హత సాధించలేకపోయింది.
జూన్ 7న ఫైనల్ ప్రారంభం
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పోటీలకు ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు అర్హత సాధించింది. రెండో జట్టుగా టీమిండియా ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ టెస్టు మ్యాచ్ జూన్ 7న ప్రారంభం కానుంది. లండన్ లోని ఓవల్ ఈ తుదిపోరుకు వేదిక కానుంది. WTC ఫైనల్ పోరుకు వరుసగా రెండో సారి చేరిన జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించింది. 2021లో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత జట్టు న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమి పాలయింది.