Team India Practice: చెమటోడుస్తున్న టీమిండియా ప్లేయర్లు, హోల్కార్ స్టేడియంలో సీరియస్ ప్రాక్టీస్
Team India Practice at Holkar Stadium in Indore
భారత ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. ఇండోర్ నగంలోని హోల్కార్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మార్చి 1 నుంచి జరగనున్న మూడో టెస్టుకు సమాయత్తం అవుతున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తో పాటు ఇతర ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. కేఎల్ రాహుల్ విషయంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. పలు సూచనలు ఇచ్చాడు. బ్యాటింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరాన్ని మరోసారి తెలియజెప్పాడు.
మ్యాచ్ టిక్కెట్లు కావాలా
హోల్కార్ స్టేడియంలో మొత్తం సీటింగ్ 30,000. అందులో 16 వేల టిక్కెట్లను అమ్మకానికి ఉంచారు. అందులో 90 శాతం టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా 10 శాతం టిక్కెట్లు మిగిలాయి. వెస్ట్ స్టాండింగ్ పొజిషన్ లో 420 రూపాయల టిక్కెట్లు ఇంకా అందుబాటులో ఉన్నట్లు స్టేడియం అధికారులు వెల్లడించారు. మొత్తం 30 వేల టిక్కెట్లలో 14 వేల టిక్కెట్లు రాజకీయ నాయకులకు, క్రికెట్ అధికారులకు, బీసీసీఐ పెద్దలకు, ఇతర వీఐపీలకు కేటాయించారు.
పటిష్ట స్థితిలో భారత్
బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భారత్ జట్టు ఇప్పటికే రెండు టెస్టు మ్యాచులను గెలిచి 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్ మార్చి 1 నుంచి ఇండోర్ నగరంలో హోల్కార్ స్టేడియంలో జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా పటిష్టంగా ఉంది. ప్రత్యేకంగా బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నారు.
Preps 🔛!#TeamIndia get into the groove for the 3⃣rd #INDvAUS Test in Indore 👌 👌@mastercardindia pic.twitter.com/iM7kmmrMLQ
— BCCI (@BCCI) February 27, 2023
BCCI