India VS NZ: మూడో వన్డేలో సెంచరీలతో కదం తొక్కిన రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్
Team India openers Rohit Sharma and Shubman gill Scored centuries
కివీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఓపెనర్లు వీర విహారం చేశారు. సెంచరీలతో కదం తొక్కారు. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ శతకాలు పూర్తి చేసుకున్నారు. రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 బౌండరీలు, 6 సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేసుకోగా, 72 బంతుల్లో శుభ్ మన్ గిల్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసిన కొద్ది సేపటికే గిల్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మకు ఇది 30వ వన్డే సెంచరీ కాగా..గిల్ కు 4వ వన్డే సెంచరీ కావడం విశేషం.
2020లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 1100 రోజుల తర్వాత మళ్లీ సెంచరీ సాధించాడు. సెంచరీ సాధించిన కొద్ది సేపటికే ఔటయ్యాడు. 101 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
గిల్ కూడా 112 పరుగుల వద్ద ఔటయ్యాడు. 78 బంతుల్లో 13 బౌండరీలు 5 సిక్సర్లతో 112 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. గిల్ ఔటయ్యే సమయానికి భారత జట్టు 230 పరుగుల వద్ద ఉంది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత విరాట్ కో్హ్లీ బరిలో దిగాడు. గిల్ ఔటైన తర్వాత ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇచ్చాడు.
2️⃣0️⃣0️⃣ partnership 🆙
There's no stopping these two👌👌
Follow the match ▶️ https://t.co/ojTz5RqWZf…#INDvNZ | @mastercardindia pic.twitter.com/IeQBl8kBI2
— BCCI (@BCCI) January 24, 2023
𝗖𝗘𝗡𝗧𝗨𝗥𝗬! 🔥
Talk about leading from the front! 🙌🏻
A magnificent century from #TeamIndia captain @ImRo45 💯
Follow the match ▶️ https://t.co/ojTz5RqWZf…#INDvNZ | @mastercardindia pic.twitter.com/iR3IJH3TdB
— BCCI (@BCCI) January 24, 2023
CENTURY number 4️⃣ in ODI cricket for @ShubmanGill!
The #TeamIndia opener is in supreme form with the bat 👌👌
Follow the match ▶️ https://t.co/ojTz5RqWZf…#INDvNZ | @mastercardindia pic.twitter.com/OhUp42xhIH
— BCCI (@BCCI) January 24, 2023