India Vs Australia: రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయం..10 వికెట్ల తేడాతో ఆసీస్ విజయకేతనం
Team India lost the Second One Day Match by 10 Wkts
రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఆసీస్ జట్టు విజయం సాధించింది. భారత జట్టు అందించిన 118 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే చేరుకుంది. ఇంకా 234 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయింది. మిచెల్ మార్ష్ 66 పరుగులు చేయగా…ట్రావిస్ హెడ్ 51 పరుగులు చేశాడు. భారత బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
ఆసీస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మిచెల్ మార్ష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. కేవలం 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. ఎటువంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేసి జట్టును విజయం వైపు నడిపించాడు.
117 పరుగులకే భారత్ ఆలౌట్
రెండో వన్డేలో ఆసీస్ బౌలర్లు వీరవిహారం చేశారు. భారత్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. 117 పరుగులకే భారత జట్టును ఆలౌట్ చేశారు. మిచెల్ స్టార్క్ 5 వికెట్లు పడగొట్టగా… సీన్ అబోట్ 3 వికెట్లు, నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీశాడు. ఆసీస్ జట్టుకు మొదటి నుంచి అన్నీ కలిసి వచ్చాయి. బౌలర్లు ఒకవైపు విజృంభిస్తుంటే, ఫీల్డర్లు కూడా ఎటువంటి పొరపాట్లు చేయకుండా బౌలర్లకు సహకరించారు. వైజాగ్ పిచ్ ఆసీస్ బౌలర్లకు సహకరించింది.
భారత జట్టు స్కోర్ 3 పరుగులు ఉన్నప్పుడు తొలి వికెట్ కోల్పోయింది. గిల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. అక్కడి నుంచి వికెట్ల పతనం ప్రారంభం అయింది. 32 పరుగుల వద్ద భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. మొదటి బంతికే ఔటయ్యి మరోసారి నిరాశ పరిచాడు. కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా కూడా వెంట వెంటనే ఔటయ్యారు.
తొలి వన్డేలో భారత జట్టును ఆదుకున్న కేఎల్ రాహుల్ రెండో వన్డేలో చేతులెత్తేశాడు. కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. స్టీవ్ స్మిత్ పట్టిన అద్భుతమైన క్యాచ్ హార్ధిక్ పాండ్యా ఇన్నింగ్స్ కు ముగింపు పలికింది. జట్టును ఆదుకుంటాడని భావించిన విరాట్ కోహ్లీ కూడా 31 పరుగులకే ఔటయ్యాడు. 49 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయిన భారత్ 71 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. 70 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన భారత్ 117 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా 16 పరుగులు చేయగా…అక్షర్ పటేల్ 29 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
WHAT. A. PERFORMANCE 👊
Australia level the ODI series after a comfortable victory in Visakhapatnam! #INDvAUS | 📝 Scorecard: https://t.co/5ISBBNMhiZ pic.twitter.com/WXwrt4FXzl
— ICC (@ICC) March 19, 2023
Australia win the second #INDvAUS ODI. #TeamIndia will look to bounce back in the series decider 👍 👍
Scorecard ▶️ https://t.co/dzoJxTO9tc @mastercardindia pic.twitter.com/XnYYXtefNr
— BCCI (@BCCI) March 19, 2023