India Vs Australia: పీకల్లోతు కష్టాల్లో భారత్.. 71 పరుగులకు 6 వికెట్లు డౌన్
Team India lost 5 Wkts for 49 runs in Second One Day
రెండో వన్డేలో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ టాపార్డర్ కకావికలం అయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ వీర విహారం చేశాడు. 4 వికెట్లు పడగొట్టాడు. సీన్ అబోట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
భారత జట్టు స్కోర్ 3 పరుగులు ఉన్నప్పుడు తొలి వికెట్ కోల్పోయింది. గిల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. అక్కడి నుంచి వికెట్ల పతనం ప్రారంభం అయింది. 32 పరుగుల వద్ద భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. మొదటి బంతికే ఔటయ్యి మరోసారి నిరాశ పరిచాడు.
కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా కూడా వెంట వెంటనే ఔటయ్యారు. తొలి వన్డేలో భారత జట్టును ఆదుకున్న కేఎల్ రాహుల్ రెండో వన్డేలో చేతులెత్తేశాడు. కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. స్టీవ్ స్మిత్ పట్టిన అద్భుతమైన క్యాచ్ హార్ధిక్ పాండ్యా ఇన్నింగ్స్ కు ముగింపు పలికింది.
71 పరుగులకు 6 వికెట్లు
జట్టును ఆదుకుంటాడని భావించిన విరాట్ కోహ్లీ కూడా 31 పరుగులకే ఔటయ్యాడు. 49 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయిన భారత్ 71 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. దీంతో కోట్లాది మంది భారత అభిమానులు తీవ్ర నిరాశలో మునిగారు.
Mitchell Starc on 🔥
He has his fourth as KL Rahul walks back. #INDvAUS | 📝 Scorecard: https://t.co/5ISBBNMhiZ pic.twitter.com/e81rUMqido
— ICC (@ICC) March 19, 2023