India Vs Australia: కష్టాల్లో రోహిత్ సేన..45 పరుగులకే 5 వికెట్లు డౌన్
Team India lost 5 Wickets for 45 runs in the third test Match
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్ల జోరుకు భారత టాపార్డర్ చేతులెత్తేసింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చటేశ్వర పుజారా, రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.
27 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 12 పరుగులకు ఔట్ అయ్యాడు. అక్కడి నుంచి వికెట్ల పతనం ప్రారంభం అయింది. మరో 18 పరుగుల వ్యవధిలో మరో 4 వికెట్లు పడిపోయాయి. ఆసీస్ బౌలర్ల మాథ్యూ కుహ్లేమాన్, నాథన్ లియాన్ భారత్ టాపార్డర్ బ్యాటర్లను బెంబేలెత్తించారు.
రెండు మార్పులతో బరిలో దిగిన భారత్
టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. కేఎల్ రాహుల్, మహ్మద్ షమీలకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు. కేఎల్ రాహుల్ స్థానంలో శుభ్మన్ గిల్, షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్ లకు స్థానం కల్పించారు.
రోహిత్ శర్మ 12 పరుగులకు ఔటవ్వగా, శుభ్మన్ గిల్ 21 పరగులు చేశాడు. చటేశ్వర పుజారా కేవలం ఒక్ పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో కేవలం 45 పరుగులకే భారత జట్టు 5 వికెట్లు కోల్పోయింది. శ్రీకర్ భరత్, విరాట్ కోహ్లీలు భారత ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.
Third wicket for Matthew Kuhnemann as India lose half their side in the first session of day one 😶#WTC23 | #INDvAUS | 📝 https://t.co/FFaPxt9fIY pic.twitter.com/iD0gJgaXI1
— ICC (@ICC) March 1, 2023
India Vs Australia