India all out for 163 runs: చతికిల పడ్డ భారత్, ఆసీస్ ముందు 76 పరుగుల టార్గెట్
Team India all out for 163 runs, Australia target 76 runs
భారత జట్టు మరోసారి చతికిలపడింది. ఆసీస్ బౌలర్ల ముందు తల వంచింది. కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 109 పరుగులు చేసిన రోహిత్ సేన, రెండో ఇన్నింగ్స్ లో సత్తా చాటుతుందని అభిమానులు ఆశించారు. అభిమానుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. చటేశ్వర పుజారా మినహా మిగతావాళ్లెవరకూ పెద్దగా రాణించలేదు.
ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి భారత్ పతనానికి కారకుడయ్యాడు. కుహ్నామాన్ ఒక వికెట్, స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు. బౌలర్లు ఎంతో నేర్పుగా బౌలింగ్ చేస్తుంటే..ఫీల్డర్లు కూడా అంతే అద్భుతంగా క్యాచులను పట్టి మ్యాచ్ పై పట్టు సాధించారు. శ్రేయాస్ అయ్యర్, పుజారా క్యాచులను ఆసీస్ ప్లేయర్లు అద్భుతంగా ఒడిసి పట్టుకున్నారు.
శ్రేయాస్ అయ్యర్ మంచి ఊపుమీదున్న సమయంలో అనుకోకుండా వచ్చిన క్యాచ్ పట్టుకుని ఉస్మాన్ ఖ్వాజా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదే విధంగా చటేశ్వర పుజారా అందించిన క్యాచ్ జారవిడవకుండా స్మిత్ పట్టుకున్నాడు. కీలకంగా మారిన వీరిద్దరి వికెట్లు పడడంతో మ్యాచ్ పలుపుతిరిగింది.
భారత బ్యాటర్ల వైఫల్యం
భారత బ్యాటర్లు మూడో టెస్టులో పూర్తిగా విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్ల ధాటిని తట్టుకోలేకపోయారు. బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉన్న ఇండోర్ పిచ్ ఆసీస్ బౌలర్లకు కలిసి వచ్చింది. రోహిత్ సేనకు శాపంగా మారింది. ఆసీస్ బౌలర్లు, ఫీల్డర్లు అద్భుత్ంగా రాణించారు. అందివచ్చిన అవకాశాలను జారవిడవకుండా అందిపుచ్చుకున్నారు.
పుజారా అర్ధశతకం
భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో చటేశ్వర పుజారా చేసిన 59 పరుగులు అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఆసీస్ బౌలర్ల ధాటిని తట్టుకుని చటేశ్వర్ పుజారా గట్టిగా నిలబడ్డాడు. జట్టును ముందుండి నడిపించాడు. రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, జడేజా, అశ్విన్, భరత్ వంటి ఆటగాళ్లందరూ ఔటవుతున్నా..పుజారా మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ఆడుతున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 35వ అర్ధశతకం స్కోర్ పూర్తి చేసుకున్నాడు. 114 బంతులు ఎదుర్కొన్న పుజారా 50 పరుగులు చేశాడు. కేవలం 5 ఫోర్లు కొట్టాడు.
Stumps on day two 🏏
Nathan Lyon ran through India's batting lineup and registered a brilliant eight-wicket haul 👌#WTC23 | #INDvAUS | 📝: https://t.co/FFaPxt9fIY pic.twitter.com/PCAUqw8HVS
— ICC (@ICC) March 2, 2023