India Vs Australia: ఆసీస్ బౌలర్ల వీర విహారం.. 117 పరుగులకే టీమిండియా ఆలౌట్
Team India all out for 117 runs in the Second One Day
రెండో వన్డేలో ఆసీస్ బౌలర్లు వీరవిహారం చేశారు. భారత్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. 117 పరుగులకే భారత జట్టును ఆలౌట్ చేశారు. మిచెల్ స్టార్క్ 5 వికెట్లు పడగొట్టాడు. సీన్ అబోట్ 3 వికెట్లు, నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీశాడు. విరాట్ కోహ్లీ చేసిన 31 పరుగులే జట్టులో అత్యధిక స్కోర్ కావడం విశేషం. దీనిని బట్టే భారత జట్టు ఏ స్థాయిలో ఆడిందో తెలుస్తోంది.
మొదటి నుంచి ఆసీస్ జట్టు తన ఆధిక్యం కొనసాగించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకున్న ఆసీస్ జట్టుకు మొదటి నుంచి అన్నీ కలిసి వచ్చాయి. బౌలర్లు ఒకవైపు విజృంభిస్తుంటే, ఫీల్డర్లు కూడా ఎటువంటి పొరపాట్లు చేయకుండా బౌలర్లకు సహకరించారు. వైజాగ్ పిచ్ ఆసీస్ బౌలర్లకు సహకరించింది. భారత బ్యాటర్లు కూడా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడకపోవడం ఆసీస్ జట్టుకు కలిసివచ్చింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు చేసిన 117 పరుగులు, ఇప్పటి వరకు చేసిన అత్యల్ప స్కోర్లలో మూడోది కావడం విశేషం.
వికెట్ల పతనం
భారత జట్టు స్కోర్ 3 పరుగులు ఉన్నప్పుడు తొలి వికెట్ కోల్పోయింది. గిల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. అక్కడి నుంచి వికెట్ల పతనం ప్రారంభం అయింది. 32 పరుగుల వద్ద భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. మొదటి బంతికే ఔటయ్యి మరోసారి నిరాశ పరిచాడు.
కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా కూడా వెంట వెంటనే ఔటయ్యారు. తొలి వన్డేలో భారత జట్టును ఆదుకున్న కేఎల్ రాహుల్ రెండో వన్డేలో చేతులెత్తేశాడు. కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. స్టీవ్ స్మిత్ పట్టిన అద్భుతమైన క్యాచ్ హార్ధిక్ పాండ్యా ఇన్నింగ్స్ కు ముగింపు పలికింది. యజట్టును ఆదుకుంటాడని భావించిన విరాట్ కోహ్లీ కూడా 31 పరుగులకే ఔటయ్యాడు. 49 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయిన భారత్ 71 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. 70 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన భారత్ 117 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా 16 పరుగులు చేయగా…అక్షర్ పటేల్ 29 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
Innings Break!#TeamIndia are all out for 117 runs in 26 overs.
Scorecard – https://t.co/c1NbIfpAkg #INDvAUS @mastercardindia pic.twitter.com/XnMVm7s4Xp
— BCCI (@BCCI) March 19, 2023
What a bowling performance from Australia! ✨
India are all out for 117! #INDvAUS | 📝 Scorecard: https://t.co/5ISBBNMhiZ pic.twitter.com/bfWB2MMDQE
— ICC (@ICC) March 19, 2023