India Vs Australia: టీమిండియా దారుణ ప్రదర్శన, 109 పరుగులకు ఆలౌట్
Team India all out for 109 runs in the First Innings of Third Test
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు దారుణంగా విఫలమయింది. తొలి ఇన్నింగ్స్ కేవలం 109 పరుగులకే ముగిసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా చేతులెత్తేసింది. బ్యాటర్లందరూ పూర్తిగా విఫలమయ్యారు. ఒక్కరంటే ఒక్కరు హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. విరాట్ కోహ్లీ చేసిన 22 పరుగులే తొలి ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు కావడం భారత్ పేలవ ప్రదర్శనకు నిదర్శనం.
మాథ్యూ కుహ్నేమాన్, నాథన్ లియాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ పతనానికి నాంది పలికారు. మాథ్యూ కుహ్నేమాన్ 5 వికెట్లు పడగొట్టగా, నాథన్ లియాన్ 3 వికెట్లు తీశాడు. టాడ్ మర్పీ ఒక వికెట్ తీసుకున్నాడు. మమ్మద్ సిరాజ్ రనౌట్ అయ్యాడు.
భారత ప్లేయర్లలో ఐదుగురు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. కోహ్లీ 22 పరుగులు, గిల్ 21 పరగులు చేశారు. శ్రీకర్ భరత్ 17 పరుగులు చేయగా..అక్షర్ పటేల్ 12, రోహిత్ శర్మ 12 పరుగులు చేశారు.
45 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన సమయంలో విరాట్ కోహ్లీ బరిలో ఉన్నాడు. కీపర్ శ్రీకర్ భరత్ కోహ్లీకి జతకలిశాడు. వీరిద్దరూ కాసేపు ఆసీస్ బౌలర్లను ప్రతిఘటించారు. జట్టు స్కోర్ ను 70 పరుగులకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో కోహ్లీ ఔటయ్యాడు. ఆ కష్ట సమయంలో అశ్విన్, అక్షర్ పటేల్ జోడీ టీమిండియాను ఆదుకుంటాదని అభిమానులు ఆశపడ్డారు. వారి ఆశలపై ఆసీస్ బౌలర్లు నీళ్లు జల్లారు. వీరి భాగస్వామ్యానికి బ్రేక్ వేశారు.
A brilliant bowling performance from Australia 👏#WTC23 | #INDvAUS | 📝: https://t.co/FFaPxt9fIY pic.twitter.com/M8pfmScWiv
— ICC (@ICC) March 1, 2023