AUSvsNZ: నేటి నుంచే సూపర్ 12 ..ఆస్ట్రేలియాతో.. న్యూజిలాండ్
AUSvsNZ: ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ICC T20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 16న ప్రారంభమైంది. ప్రస్తుతం గ్రూప్ మ్యాచ్ లు జరుగుతుండగా.. నేటి నుంచి సూపర్ -12 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. సూపర్-12 ప్రారంభ మ్యాచ్ అతిథ్య జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగునుంది. ఈ మ్యాచ్ కు వాన అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కే కాదు ఆ తర్వాత రోజు జరిగే భారత్, పాక్ మ్యాచ్ కు కూడా వర్షం అడ్డుతగిలే అవకాశం లేకపోలేదు. ఈరోజు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. గతేడాది ICC T20 వరల్డ్ 2021 ఫైనల్‌లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది. ఇప్పుడు ఈ మ్యాచ్ లోగెలిచి వరల్డ్ కప్ బోణి కొట్టాలని చూస్తోంది న్యూజిలాండ్.
ఇక ఇరు జట్లలోనూ సూపర్ ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. ఫించ్, వార్నర్, మిషెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, డేవిడ్‌తో కూడిన ఆసీస్ బ్యాటింగ్ లైనప్ శత్రుదుర్భేద్యంగా కనిపిస్తుంటే.. కాన్వే, గప్టిల్, విలియమ్సన్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, నీషమ్‌తో న్యూజిలాండ్‌కు కూడా మెరుగైన బ్యాటింగ్ బలగం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. పాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్, జోష్ హజిల్‌వుడ్ రూపంలో కంగారూలకు ముగ్గురు మొనగాళ్లు అందుబాటులో ఉండగా.. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, ఫెర్గూసన్‌పై కివీస్ ఆశలు పెట్టుకుంది. మరి గత ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్ బదులు తీర్చుకుంటుందా లేక, సొంతగడ్డపై ఆసీస్ శుభారంభం చేస్తుందా చూడాలి.