India vs Zimbabwe:నేడు జింబాబ్వేతో భారత్ కీలక పోరు
India vs Zimbabwe: టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి టీమిండియా సిద్ధమైంది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వేతో రోహిత్ సేననేడు తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత జట్టు ఈ కీలక మ్యాచ్‌లోనూ సాధికార విజయం సాధించి సెమీఫైనల్లో ఘనంగా అడుగుపెట్టాలని వ్యూహాలు రచిస్తోంది.
జింబాబ్వే పాకిస్థాన్ లాంటి పెద్ద జట్టుకే షాకిచ్చింది. కాబట్టి రోహిత్ సేన ఆ జట్టును తేలిగ్గా తీసుకోకూడదు. మరోవైపు టీమిండియాను జట్టు కూర్పు ఇబ్బందిగా మారింది. గత మ్యాచ్ ద్వారా ఓపెనర్ రాహుల్ ఫామ్ లోకి రావడం ఊరటనిచ్చే అంశమే. ఆ ఫామ్ ను అలానే కొనసాగించాలని టీమ్ మేనెజ్ మెంట్ కోరుకుంటుంది. అయితే మరోవైపు కెప్టెన్ రోహిత్ నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో 74 పరుగులే చేసిన సారథి రోహిత్ శర్మ నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అశ్విన్‌లతో కూడిన టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే గ్రూప్-1లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సైమీస్ చేరాయి. ఇవాళ మనం గెలిస్తే సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఢీకొనే అవకాశం ఉంటుంది.
టీ20 ప్రపంచకప్‌లో రాహుల్,రోహిత్ మధ్య ఒక్కసారి కూడా అర్ధ శతక భాగస్వామ్యం నమోదు కాలేదు. దీంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అలాగే ఫామ్‌లో ఉన్న విరాట్, సూర్యకుమార్‌లకు అండగా నిలిచేవారు కనిపించడం లేదు. హార్దిక్ పాక్‌పై మాత్రమే మెరుగ్గా ఆడాడు. దినేశ్ కార్తీక్ ఇప్పటి వరకు 14 పరుగులు మాత్రమే చేశాడు. వీరంతా ఎదురుదాడికి దిగితేనే ఫలితం ఉంటుంది.
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, హార్దిక్, దినేశ్ కార్తీక్, అక్షర్/హుడా, అశ్విన్, భువనేశ్వర్, షమి, అర్ష్‌దీప్.
జింబాబ్వే: మధెవెరె, ఇర్విన్(కెప్టెన్), చకబ్వ, విలియమ్స్, రజా, షుంబా, బుర్ల్, జోంగ్వే, ఎన్‌గరవ, చటారా, ముజరబాని.