India VS West Indies: టీ 20 ఫైట్‌కు సిద్ధమైన భారత్, వెస్టిండీస్
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య టీ 20 సిరీస్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. 5 మ్యాచుల టీ 20 సిరీస్ ఆగస్టు 7 వరకు జరగనుంది. మొదటి మూడు మ్యాచులు వెస్టిండీస్‌లోనే జరగనున్నాయి. ఆ తర్వాత రెండు మ్యాచులు అమెరికాలో జరగనున్నాయి. అక్కడ క్రికెట్‌పై ఆసక్తిని పెంచే ఉద్దేశ్యంతో చివరి రెండు మ్యాచులను ఫ్లోరిడాలోని బ్రాడ్ వే కంట్రీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. 3-0 తేడాతో వెస్టిండీస్‌పై తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. సీనియర్ ఆటగాళ్లు చాలా మంది వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్నారు. శిఖర్ ధావన్ నేతృత్వంలోని వన్డే జట్టు అప్రతిహత విజయాలు దక్కించుకుంది.
టీ 20 సిరీస్‌కు మాత్రం రోహిత్ శర్మ కెప్టన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. కొంత కాలం పాటు జట్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ ట్రినిడాడ్ చేరుకున్నారు. వీరితో పాటు వన్డే జట్టులోని మరికొందరు సభ్యులు టీ 20 సిరీస్‌లో ఆడనున్నారు.
ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఆడే జట్టు సభ్యుల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎవరెవరికి అవకాశం కల్పిస్తారనే విషయంలో క్లారిటీ రాలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత జట్టు ప్రస్తుతం పటిష్టంగా ఉంది. చాలా మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. వారి నుంచి తుది జట్టులో ఎవరికి చోటు దక్కనుందో మరికాసేపట్లో తేలనుంది.
తొలి టీ 20 మ్యాచ్ ట్రినిడాడ్‌లో బ్రియాన్ లారా స్టేడియం జూలై 29న జరగనుంది. రెండో టీ 20 మ్యాచ్ సెయింట్ కిట్స్ లో వార్నర్ పార్క్ స్టేడియంలో ఆగస్టు 1న జరగనుంది మూడో టీ మ్యాచ్ కూడా వార్నర్ పార్క్ స్టేడియంలో ఆగస్టు 2న జరగనుంది. చివరి రెండు మ్యాచులు అమెరికాలో ఫ్లోరిడాలోని ఆగస్టు 6, ఆగస్టు 7 తేదీల్లో జరగనున్నాయి.
All Set For The T20Is! 🙌
ARE YOU READY❓#TeamIndia | #WIvIND pic.twitter.com/oWjEKyUdac
— BCCI (@BCCI) July 28, 2022