Sunil Gavaskar: నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసిన సునీల్ గవాస్కర్
Sunil Gavaskar: బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణితో పాటు రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్‌ను స్వీకరించారు. అవార్డ్ అందుకున్నాక దేశం మొత్తం ‘ఆర్ ఆర్ ఆర్’ గురించే చర్చించుకున్నారు. తెలుగోడిపాట విశ్వవేదికపై వినిపించడంతో కీరవాణిని, పాట రాసిన చంద్రబోస్ ను ఆకాశానికెత్తారు. ఈ పాటకు ఒక ఇండియన్స్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం ప్రతిఒక్కరు కాలుకదిపారు.
తాజాగా ఈ పాటకు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్టెప్పేసాడు. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా జరుగుతున్న కామెంటరీలో క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ‘ఆర్ ఆర్ ఆర్’ అవార్డు గెలుచుకొన్న ప్రస్తావన తెచ్చారు. దాంతో కామెంటరీ నిపుణులు సునీల్ గవాస్కర్ మాట్లాడించి స్టెప్పులేయించారు. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అవార్డు వస్తుందని భావించాను. నేను అనుకొన్నట్టుగానే అవార్డు వచ్చింది. నాటు నాటు పాటను ప్రపంచంలోని అన్ని వర్గాలను ఆలరించే విధంగా చేసిన మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్స్‌కు అభినందనలు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అద్బుతంగా ఉంది. నేను కూడా ఆ సినిమాను చూశాను అని సునీల్ గవాస్కర్ చెప్పారు.
మన తెలుగు పాట ✨
🕺🏻 నాటు నాటు 🕺🏻 కు 😎
ఆస్కార్ రావటం గర్వకారణం 😍ఈ అరుదైన సందర్భం పై 👏🏻
లెజెండ్ సునీల్ గవాస్కర్ 🤩
& స్టార్ స్పోర్ట్స్ తెలుగు టీం సంతోషాన్ని 😉మీరు చూసేయండి 🥳
Mastercard #INDvAUS #StarSportsTelugu #TestByFire🔥 #RRR #RamCharan #SunilGavaskar #JrNTR pic.twitter.com/UVnaxilfz1
— StarSportsTelugu (@StarSportsTel) March 13, 2023