India Vs SL: తొలి వన్డేలో హిట్‌మ్యాన్ జోరు, హ్యాఫ్ సెంచరీ పూర్తి
Srilanka won the toss and invited India for batting in First ODI
భారత్, శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరీస్ మొదలయింది. తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్‌లు ఓపెనర్లుగా దిగారు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత జట్టు ఒక్క వికెట్ కోల్పోకుడా 75 పరుగులు చేసింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. పాత రోహిత్ శర్మను తలపిస్తున్నాడు.
మరోవైపు గిల్ కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా సంయమనంతో ఆడుతున్నాడు. రోహిత్‌కు చక్కని సహకారం అందిస్తున్నాడు. లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఓపెనర్లు ఇద్దరు గట్టి పునాది వేశారు.ఈ క్రమంలో రోహిత్ శర్మ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 7 బౌండరీలు, 2 సిక్సర్లు బాదాడు.
That's a brilliant 50-run partnership between @ImRo45 & @ShubmanGill 💥💥
Live – https://t.co/262rcUdafb #INDvSL @mastercardindia pic.twitter.com/nrIvQ6gdVK
— BCCI (@BCCI) January 10, 2023